Nikhil : బిగ్ బాస్ 8 విజేత‌గా క‌న్న‌డ ఆర్టిస్ట్‌.. గ‌త సీజ‌న్స్ క‌న్నా ఎక్కువే రాబ‌ట్టాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nikhil : బిగ్ బాస్ 8 విజేత‌గా క‌న్న‌డ ఆర్టిస్ట్‌.. గ‌త సీజ‌న్స్ క‌న్నా ఎక్కువే రాబ‌ట్టాడుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 December 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Nikhil : బిగ్ బాస్ 8 విజేత‌గా క‌న్న‌డ ఆర్టిస్ట్‌.. గ‌త సీజ‌న్స్ క‌న్నా ఎక్కువే రాబ‌ట్టాడుగా..!

Nikhil : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజా సీజ‌న్‌లో విజేత ఎవ‌రనేది తెలిసిపోయింది. 105 రోజుల పాటు సాగిన ఈ రియాల్టీ గేమ్ షో నేటితో ముగిసింది. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్‌ సీజన్‌ 8 విజేతగా నిలిచాడు. గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ 8 సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విజేత నిఖిల్‌కు ట్రోఫీ అందించారు. అలాగే, రూ. 55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు మారుతీ సుజుకీ డాజ్లింగ్ డిజైర్ కారును కూడా అందించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ బిగ్‌బాస్‌ సీజన్‌లలో బిగ్ ప్రైజ్‌ మనీగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

Nikhil బిగ్ బాస్ 8 విజేత‌గా క‌న్న‌డ ఆర్టిస్ట్‌ గ‌త సీజ‌న్స్ క‌న్నా ఎక్కువే రాబ‌ట్టాడుగా

Nikhil : బిగ్ బాస్ 8 విజేత‌గా క‌న్న‌డ ఆర్టిస్ట్‌.. గ‌త సీజ‌న్స్ క‌న్నా ఎక్కువే రాబ‌ట్టాడుగా..!

Nikhil విజేత ఎవ‌రంటే..

బిగ్‌బాస్‌ 8 సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్‌ షోలో పాల్గొన్నారు. ఫినాలే వీక్‌లో గౌతమ్‌, ప్రేరణ, నిఖిల్, అవినాష్‌, నబీల్ ఫైనలిస్ట్‌గా నిలిచారు. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిఖిల్ ఫైనల్ రేసులో విన్నర్‌గా నిలవగా, గౌతమ్‌ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్ నిఖిల్‌ రూ.55 లక్షల ప్రైజ్‌మనీ, మారుతీ సుజూకీ కారును అందుకున్నాడు. అయితే తెలుగు నటుడు కాకపోవడంతో కన్నడ బ్యాచ్ అంటూ నిఖిల్ పైకి అవమానాలు మొదలయ్యాయి. యష్మి విషయంలో నిఖిల్ చివరికి తన క్యారెక్టర్ పై కూడా మచ్చ వేయించుకున్నాడు. ఆడవాళ్ళని వాడుకునే రకం అంటూ ఇతర హౌస్ మేట్స్ నిఖిల్ క్యారెక్టర్ ని తప్పు పట్టారు. అయినప్పటికీ నిఖిల్ సహనం కోల్పోలేదు. కోపం వచ్చినప్పటికీ నోరు జారే విధంగా ప్రవర్తించలేదు. అన్నింటికీ తట్టుకుని దమ్మున్నోడిగా నిలబడ్డాడు.

బిగ్ బాస్ చరిత్రలోనే నిఖిల్ అత్యథిక ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ విన్నర్ కి 50 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారు. కానీ ఈ సీజన్ కి ప్రైజ్ మనీ 55 లక్షలకి చేరింది. ప్రైజ్ మనీ పక్కన పెడితే నిఖిల్ రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో వారానికి 2.25 లక్షలు రెమ్యునేషన్ తీసుకున్నాడు. మొత్తం 15 వారాలకు నిఖిల్ లో పారితోషికం రూపంలో 33 లక్షల వరకు ముట్టింది. ప్రైజ్ మనీ 55 లక్షలు, రెమ్యునరేషన్ 33 లక్షలు కలిపి మొత్తం 88 లక్షల వరకు నిఖిల్ బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా సంపాదించాడు. దీనితో పాటు మారుతీ సుజుకి డిజైర్ కారు కూడా నిఖిల్ కి దక్కుతుంది. మొత్తంగా చూసుకుంటే నిఖిల్ సంపాదన దాదాపు కోటి రూపాయలు అనుకోవచ్చు. ఏదేమైన ఈ సీజ‌న్ అంత జోష్ అందించ‌లేద‌ని చెప్పాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది