Home » Entertainment » Nikhil Siddharth Satires On Sreemukhi In Sa Re Ga Ma Show Promo
Entertainment

SreeMukhi : ఇలాంటి వారి మధ్యలో నువ్వెందుకు ఉన్నావ్?.. షోలో శ్రీముఖి పరువుతీసిన యంగ్ హీరో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 20, 2022, 1:00 pm
Advertisement

Sreemukhi : శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉందన్న సంగతి తెలిసిందే. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు అని తేడా లేకుండా అన్ని ఈవెంట్లలో కనిపిస్తుంది. అన్ని షోల్లో సందడి చేస్తోంది. ఈటీవీలో జాతి రత్నాలు అనే షోను సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. ఇక స్టార్ మాలో అయితే పండుగ ఈవెంట్లను నడిపిస్తోంది. జీ తెలుగులో సరిగమప సింగింగ్ షోలో యాంకర్‌గా చేస్తోంది. అలా అన్ని చోట్లా శ్రీముఖే కనిపిస్తోంది. ఇక శ్రీముఖి సింగింగ్ షోలో చేసే అందాల ఆరబోత మీద ఎంతో నెగెటివిటీ ఏర్పడింది.

Advertisement

సింగింగ్ షోలోనూ తొడలు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవడంపై శ్రీముఖి మీద నెగెటివిటీ ఏర్పడింది. అయితే శ్రీముఖి వస్త్రదారణలో కాస్త మార్పు వచ్చినట్టుంది. ఇప్పుడు కాస్త పొడవాటి డ్రెస్సులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీముఖి కాస్త పద్దతిగానే కనిపించింది. అయితే ఇప్పుడు సరిగమప షోలో ఫ్యాన్స్ రౌండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కార్తీకేయ 2 చిత్రం ప్రమోషన్స్ కూడా చేపట్టారు. ఇందు కోసం హీరో నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు.

Nikhil Siddharth Satires on Sreemukhi in Sa re ga ma show promo

Advertisement

అయితే ఎంట్రీలోనే శ్రీముఖి మీద కౌంటర్ వేశాడు. ఈ షో అంటే తన శ్రీమతికి ఎంతో ఇష్టమట. కచ్చితంగా ప్రతీ ఎపిసోడ్ చూస్తుందని నిఖిల్ తెలిపాడు. అయితే ఆ తరువాత శ్రీముఖి మీద సెటైర్లు వేశాడు. ఇంత మంది మంచి మ్యూజిక్ డైరెక్టర్లు, ఆర్టిస్టుల మధ్య నువ్వేంటి? అని గాలి తీసేశాడు నిఖిల్. ఆ మాటతో శ్రీముఖి ఒక్కసారిగా అవాక్కైంది. నిఖిల్ వేసిన కౌంటర్లతో అందరూ పగలబడి నవ్వేశారు. మొత్తానికి శ్రీముఖి ఈ షోలో బాగానే సెట్ అయింది. ఇక ఓ ట్రాక్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు.

సింగర్‌తో తాను ప్రేమలో పడ్డట్టుగా శ్రీముఖి బాగానే ట్రాక్ నడిపిస్తోంది. ప్రోమో చివర్లో వేసిన పబ్లిసిటీ స్టంట్, టీఆర్పీ స్ట్రాటజీలు అందరికీ తెలిసినవే. అందుకే వాటిని ఎవ్వడూ కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. మొత్తానికి శ్రీముఖి ప్రయాస వృథాగా మారినట్టుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి