Home » Entertainment » Nirupam Disappoints With Hima Request In Karthika Deepam
Entertainment

Karthika Deepam : నిరుపమ్, హిమ మాటలు విన్న శౌర్య.. పశ్చాతాప పడుతుందా? హిమను.. శౌర్య అర్థం చేసుకుంటుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: July 17, 2022, 10:41 am
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 18 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 1407 హైలైట్ప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరుపమ్, హిమ పెళ్లి ఎలా ఆపాలి అని టెన్షన్ పడుతుంటాడు ప్రేమ్. స్వప్నకు ఎలాగూ మాటిచ్చాడు కానీ.. ఎలా ఆపాలో ఆయనకు అర్థం కాదు. మరోవైపు ఓ వ్యక్తి మణికొండ వెళ్లాలి అని అడుగుతాడు. దీంతో తన ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్తుంది శౌర్య. అతడు తన ఇంటి దగ్గరికే ఆటోను తీసుకెళ్లమనడంతో శౌర్య షాక్ అవుతుంది. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దీంతో ఆనంద రావు.. నా ఫ్రెండ్ అని చెబుతాడు. దీంతో సరే అనుకుంటుంది. ఆ తర్వాత శౌర్య కూడా లోపలికి వెళ్తుంది. దీంతో అతడు శౌర్యను చూసి షాక్ అవుతాడు. ఆటో అమ్మాయి నువ్వేంటి లోపలికి వచ్చావు. నువ్వెందుకు ఇంట్లోకి వచ్చావు అని అడుగుతాడు. దీంతో ఎందుకు నేను రావద్దా అని అడుగుతుంది శౌర్య.

Advertisement

nirupam disappoints with hima request in karthika deepam

దీంతో ఇది నా ఇల్లే అంటుంది శౌర్య. దీంతో అతడు షాక్ అవుతాడు. ఆనంద రావును అడిగితే తను నా పెద్దబ్బాయి కూతురు అని చెబుతాడు. ఆ తర్వాత శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది హిమ. ఎలా శౌర్య, నిరుపమ్ పెళ్లి చేయాలి అని అనుకుంటుంది హిమ. మరోవైపు శౌర్య కూడా తన అమ్మానాన్నల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నిరుపమ్ వస్తాడు. తనను వెనుక నుంచి చూసి హిమ అనుకొని తన భుజం మీద చేయి వేసి.. ఐలవ్యూ అని చెబుతాడు నిరుపమ్.

Advertisement

Karthika Deepam : నిరుపమ్ ను చూసి షాక్ అయిన శౌర్య

తనకు ఐలవ్యూ చెప్పడంతో శౌర్య షాక్ అవుతుంది. తిరిగి చూస్తుంది. తను హిమ కాదు.. శౌర్య అని తెలుసుకొని నిరుపమ్ షాక్ అవుతాడు. నేను హిమ అనుకున్నాను అంటాడు. ఆ తర్వాత కోపంతో శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

నిరుపమ్, హిమను కలుస్తాడు. హిమ మాత్రం మళ్లీ నిరుపమ్ ను రిక్వెస్ట్ చేస్తుంది. ఎలాగైనా శౌర్యను పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. దీంతో ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేశాక.. ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు నిరుపమ్.

Advertisement

దీంతో అదే ముహూర్తానికి శౌర్య మెడలో తాళి కట్టు అంటుంది హిమ. దీంతో నిరుపమ్ షాక్ అవుతాడు. కోపంతో అక్కడి నుంచి బయటికి వస్తాడు. నిరుపమ్, హిమ మాట్లాడుకునే మాటలు విని శౌర్య పశ్చాతాపపడుతుంది. ఏం చేయాలో శౌర్యకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి