Nirupam Paritala : ప్రవచనాలు కాదు.. పనికొచ్చే వచనాలు!.. వామ్మో డాక్టర్ బాబు మామూలోడు కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nirupam Paritala : ప్రవచనాలు కాదు.. పనికొచ్చే వచనాలు!.. వామ్మో డాక్టర్ బాబు మామూలోడు కాదు

 Authored By prabhas | The Telugu News | Updated on :23 November 2021,4:30 pm

Nirupam Paritala : డాక్టర్ బాబు ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. బుల్లితెరపై సీరియళ్లతో దూసుకుపోతోన్నాడు. కార్తీకదీపం ఒక వైపు.. హిట్లర్ గారి పెళ్లాం ఇంకో వైపు. మొత్తానికి నిరుపమ్ మాత్రం మంచి స్పీడు మీదున్నాడు. ఇక సోషల్ మీడియాతో అయితే నిరుపమ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ మధ్య యూట్యూబ్‌లో కూడా నిరుపమ్ హల్చల్ చేస్తున్నాడు. తన భార్య మంజుల ఆ యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ఎక్కువగా డాక్టర్ బాబు పర్సనల్ విషయాలే చెబుతుంటుంది.

ఇక నిరుపమ్ స్వతాహాగా రచయిత అన్న విషయం తెలిసిందే. నిరుపమ్ తండ్రి ఓంకార్ ఎన్నో సీరియళ్లకు కథలు, సంభాషణలు అందించారు. ఆయన ఓ రచయిత. ఆ వారసత్వం కూడా నిరుపమ్‌కు వచ్చినట్టుంది. అందుకే అప్పుడప్పుడు తనలోని రచయిత బయటకు వస్తాడు. ప్రాసలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా మరోసారి తన లోని రైటింగ్ స్కిల్స్‌ను అందరికీ చూపించాడు. ప్రవచనాలు, వచనాలు అంటూ అందరినీ నవ్వించేశాడు.

Nirupam Paritala Funny Quotation On Social Media

Nirupam Paritala Funny Quotation On Social Media

Nirupam Paritala : వచనాలు అంటూ డాక్టర్ బాబు ప్రాసలు..

నవ్వు నాలుగు విధాల చేటు.. కానీ జీవితంలో మాత్రం నవ్వు లేకపోవడం తీరని లోటు.. ఇది ప్రవచనాలు కాదు.. పనికొచ్చే వచనాలు అని నిరుపమ్ తన స్టైట్లో ప్రాసతో పిచ్చెక్కించాడు. మాకు క్యాప్షన్ సూచనలు, ఈ ప్రవచానాలు మాకు రోజు కావాలి డాక్టర్ బాబు.. ఆ పిక్ ఎవరు తీశారు డాక్టర్ బాబు.. మీ కంట్లో నీళ్లు ఎందుకు వచ్చాయ్ డాక్టర్ బాబు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలా నిరుపమ్ వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది