Karthika Deepam : డాక్టర్ బాబు ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. మంజుల పిక్స్ వైరల్
Karthika Deepam : కార్తీకదీపం సీరియల్‌తో నిరుపమ్ పరిటాలకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. బుల్లితెర సూపర్ స్టార్, శోభన్ బాబు అంటూ నిరుపమ్ ఫుల్ స్టార్డం వచ్చింది. ఇప్పుడు బుల్లితెరను ఏలేస్తున్న కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబుగా , కార్తీక్‌గా నిరుపమ్ నటన అద్బుతంగా ఉంది. అలా స్టార్ మాలో ఇంతగా హిట్ అవ్వడంతో జీ తెలుగు చానెల్ కూడా నిరుపమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. హిట్లర్ గారి పెళ్లాం అంటూ వస్తోన్న సీరియల్‌లో నిరుపమ్ అదరగొట్టేస్తున్నాడు.

Nirupam Paritala Wife Manuja On Diwali Festival
ఇక నిరుపమ్ భార్యగా మంజుల పరిటాలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కూడా బుల్లితెరపై మంచి నటి. అయితే ఇప్పుడు మాత్రం అంతగా సీరియల్స్‌లో నటించడం లేదు. హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌లో తాను కూడా ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టు మంజుల ప్రకటించింది. అలా భర్తతో కలిసి కొన్ని సీరియల్స్‌లొ మంజుల నటిస్తోంది. ఇక యూట్యూబ్‌లో ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వీడియోలతో నానా హంగామా చేస్తున్నారు.
Karthika Deepam : దీపావళి సంబరాల్లో మంజుల..

Nirupam Paritala Wife Manuja On Diwali Festival
దసరాకు రకరకాల వీడియోలతో సందడి చేశారు. షాపింగ్ అంటూ మంజుల తొమ్మిది అవతారాలకు సంబంధించిన తొమ్మిది చీరలను కొనేసింది. దసరా పండుగకు అలా షాపింగ్ చేసిన మంజుల.. ఇప్పుడు దీపావళికి ఎలాంటి షాపింగ్ చేసిందో. కానీ తాజాగా మంజుల కొన్నిఫోటోలను షేర్ చేసింది. దీపావళి పండుగకు సంబంధించిన ఇలా రెడీ అయ్యాం.. ఇంట్లో పూజలు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది.