Nisha Agarwal shares an interesting topic related to Kajal Agarwal
Nisha Agarwal : పంచదార బొమ్మ, టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే. గత ఏడాది గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మూడో వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అందుబాటులో ఉంటోంది. తన బేబీ బంప్ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ కాజల్ శ్రీమంతం జరగగా, ఆ వేడుకకి సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.కాజల్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో ఆమె ఫ్యామిలీ సంతోషంగా ఉంది.
తాజాగా ఇదే విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ తో తెలియజేసింది. కాజల్‌తో కలిసి ఉన్న ఒక అందమైన పిక్ ను షేర్ చేస్తూ నిషా తన ఆనందాన్ని పంచుకుంది. “అవును! ఇది అధికారికంగా అధికారికం.. నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. ఇక్కడే ఈ గర్భంలో నేను తాకుతున్నాను. నా బిడ్డ నం 2 దారిలో ఉంది! నేను నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్న లిటిల్ లవ్… కాజల్ అగర్వాల్ అండ్ గౌతమ్ కిచ్లు మీరు ఎప్పటికీ మంచి ఆరోగ్యంతో, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను అని నిషా పేర్కొంది.మీరు కొత్త పాత్రలను పోషించి, ఈ అందమైన తల్లిదండ్రుల ప్రయాణాన్ని ప్రారంభించినందున మీ ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను”
Nisha Agarwal shares in interesting topic related to Kajal Agarwal
అంటూ నిషా షేర్ చేసిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కాజల్ ప్రెగ్నెన్సీని ఇటీవలే అధికారికంగా తెలిపారు గౌతమ్ కిచ్లు. ప్రస్తుతం ఈ దంపతులు తమ తొలి సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కాజల్ సీమంతం పిక్స్‌తో పాటు బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అక్క కాజల్‌తో దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ తన సోదరి ప్రెగ్నెన్సీ గురించి ఎమోషనల్ కామెంట్ పోస్ట్ చేసింది. కాజల్ చెల్లెలుగా సినీ ఎంట్రీ ఇచ్చిన నిషా అగర్వాల్.. ”ఏమైంది ఈవేళ, సోలో, ఇష్టం, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో” వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బిజినెస్ మేన్ కరణ్ వలేచను పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.