ram charan shares interesting video of Pawan Kalyan and Chiranjeevi
Ram Charan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమంలో మూవీపై సినీ, రాజకీయ ప్రముఖులు స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. ఇక రామ్ చరణ్.. రీసెంట్‌గా ఓ వీడియో షేర్ చేసి అందరిలో ఆసక్తి పెంచారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిస్తే ఆ రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిస్తే.. ఆ గ్రేసే వేరు. అయితే తాజాగా వీరిద్దరు షూటింగ్ సెట్స్‌లో కలిశారు.ప్రస్తుతం మెగా హీరోలంతా ఎవరి సినిమా షూటింగ్‌లో వారు బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల తన భీమ్లా నాయక్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్.. రానాతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమయ్యింది. మరోవైపు చిరు.. ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ను ప్రారంభించారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.అయితే ఇటీవల భీమ్లా నాయక్ సెట్‌లోకి చిరంజీవి, గాడ్ ఫాదర్ సెట్‌లోకి పవన్ కళ్యాణ్ వెళ్లారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా తయారు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు మెగా అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు.
ram charan shares interesting video of Pawan Kalyan and Chiranjeevi
ఇంతకీ చిరంజీవి వేసుకున్న డ్రెస్ ఏదో తెలుసా? ఖైదీ నెం.786 అనే ఖైది డ్రెస్. చిరంజీవి రాకను పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తెగ ఎంజాయ్ చేశారు. అలాగే తర్వాత గాడ్ ఫాదర్ సెట్స్‌ను పవన్ కళ్యాణ్ విజిట్ చేశారు. ఆయనకు తోడుగా త్రివిక్రమ్ కూడా వచ్చారు ఆ సమయంలో చిరంజీవి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో మాట్లాడుతున్నారు. వారిలో విజయేంద్ర ప్రసాద్, ఆర్.నారాయణమూర్తి తదితరులున్నారు. భీమ్లా నాయక్‌ను గాడ్ ఫాదర్.. గాడ్‌ఫాదర్‌ను భీమ్లా నాయక్ కలుసుకున్న అపూర్వ క్షణాలను వీడియోలో బంధించి దాన్ని ఈరోజు విడుదల చేశారు రామ్ చరణ్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.