bheemla nayak gets huge response in us advance bookings
Bheemla Nayak : ప్రస్తుతం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీమ్లా నాయక్ మూవీ భారీ ఓపెనింగ్ రికార్డు సెట్ చేసేలా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది. ఒకరోజు ముందే యూఎస్ లో భీమ్లా నాయక్ ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భారీ వసూళ్లు రాబట్టేలా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $200000 డాలర్స్ దాటేసింది.
యు.ఎస్‌లో.. భీమ్లా నాయక్ 325 లొకేషన్స్‌లో రిలీజ్ అవుతుంది.ఇన్ని లొకేషన్స్‌లో ఇప్పటి వరకు 618000 డాలర్స్‌ను రాబట్టుకుంది. అంటే ప్రీమిర్స్ ద్వారానే నాలుగు కోట్లకు పైగానే ఇప్పటికే భీమ్లా నాయక్ రాబ్టటేశాడు. వన్ మిలియన్ దిశగా అడుగులేస్తున్నాడు. కరోనా మూడు వేవ్స్ దెబ్బకు తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ బాగానే దెబ్బతింది. అఖండ, పుష్ప సినిమాలు బాగానే అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే అవి రిలీజ్ తర్వాతనే మంచి వసూళ్లను సాధించాయి. కరోనా తర్వాత బాలీవుడ్ సహా మరే సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ యు.ఎస్‌లో రాలేదు . కొత్త రికార్డు సెట్ చేసిన భీమ్లా నాయక్ గురించి ప్రస్తుతం అంతటా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
bheemla nayak gets huge response in us advance bookings
భీమ్లా నాయక్ మూవీ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కి అధికారిక రీమేక్. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించగా… నాగవంశీ నిర్మించారు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. థమన్ సంగీతం అందిస్తుండగా రానా కీలక రోల్ చేస్తున్నారు. నిత్యామీనన్ రానాకి జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ రిలీజ్ ట్రైలర్‌లో భీమ్లా నాయక్, డేనియర్ శేఖర్ పాత్రల్లో పవన్ కల్యాణ్, రానాలు ఇద్దరూ ఢీ అంటే ఢీ అనేలా ఉన్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో ఉంది. చివర్లో పవన్ కల్యాణ్, రానాలు తలపడుతూ అదరగొట్టారు. ఇక ఈ ట్రైలర్‌లో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది.
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
This website uses cookies.