Nithya Menon : అనవసరంగా నటిని అయ్యా.. ఇప్పటికిప్పుడు సినిమాలు ఆపేయాలని ఉందంటున్న స్టార్ హీరోయిన్..!
ప్రధానాంశాలు:
Nithya Menon : అనవసరంగా నటిని అయ్యా.. ఇప్పటికిప్పుడు సినిమాలు ఆపేయాలని ఉందంటున్న స్టార్ హీరోయిన్..!
Nithya Menon: మలయాళం Malayalam నుంచి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న భామ నిత్యా మీనన్ Nithya Menon తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కొన్నాళ్లు తన మార్క్ పాత్రల్లో అలరిస్తూ వచ్చిన అమ్మడు కాస్త ఫాం తగ్గేసరికి వెనకపడింది. ఐతే తిరు సినిమాతో ఈమధ్యనే నేషనల్ అవార్డ్ అందుకుంది అమ్మడు. అసలైతే Mahanati మహానటి సినిమాలో కీర్తి సురేష్ keerthy suresh కన్నా ముందు నిత్యా మీనన్ నే అనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ఆమె చేయలేదు.మహానటి నిత్యా మీనన్ చేసి ఉంటే మాత్రం వేరే లెవెల్ లో ఉండేది. ప్రస్తుతం రవి మోహన్ తో ఒక సినిమా, ధనుష్ తో మరో సినిమా చేస్తుంది నిత్యా మీనన్. ఐతే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఇప్పటికిప్పుడు సినిమాలు మానేయాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చింది నిత్యా మీనన్. అమ్మడు అలా చెప్పడానికి కారణం తాను తన జీవితాన్ని ఎంతో స్వేచ్చగా ఊహించుకోగా సినిమాల్లో వచ్చి స్టార్ అయ్యాక అంత రిస్ట్రిక్టెడ్ గా మారిందట.
Nithya Menon : ఇలాంటివి అన్నీ చాలా అసౌకర్యంగా..
బయటకి వెళ్తే చాలు అందరు తన వెంట చూస్తారు. మాట్లాడేందుకు ట్రై చేస్తారు. ఇలాంటివి అన్నీ చాలా అసౌకర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది నిత్యా మీనన్. తాను చిన్నప్పుడు పైలెట్ అయ్యి ప్రపంచమంతా తిరగాలని అనుకున్న విషయాన్ని చెప్పింది. అది పక్కన పెడితే కనీసం పార్క్ లో నడిచే అవకాశం కూడా ఉండట్లేదని అంటుంది నిత్యా.
అమ్మడు ఏదో బాగా డిస్ట్రబ్ లో ఉండే ఇలా మాట్లాడుతుందని అర్ధమవుతుంది. ఐతే సెలబ్రిటీలు ఎక్కడ కనబడితే అక్కడ వారిని ఇబ్బంది పెడుతూ జనాలు ఏదో ఫీల్ అవుతుంటారు. అలాంటి టైం లో అవతల వ్యక్తి కూడా మన లాంటి మనిషే అని ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నారు. నిత్యా మీనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతుంది. నేషనల్ అవార్డ్ ముందు సినిమాలు ఆపేద్దాం అనుకుందట. ఐతే అవార్డ్ వచ్చింది కాబట్టి కొనసాగిస్తుందని తెలుస్తుంది. ఏది ఏమైనా నిత్యా తిరిగి ఫాం లోకి వస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.