Home » Entertainment » Nitya Menon Angry On Bheemla Nayak Team
Entertainment

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ టీంపై గుర్రుగా ఉన్న నిత్యా మీన‌న్.. అస‌లు విష‌యం ఇది..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 2, 2022, 12:30 pm
Advertisement

Nitya Menon : ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో తెగ సంద‌డి చేస్తున్న సూపర్ హిట్ చిత్రం భీమ్లా నాయ‌క్. ప‌వ‌న్, రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వెండితెరపై పవన్ కళ్యాణ్‌ని చూపించిన విధానానికి జేజేలు కొడుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక రానా, నిత్యా మీన‌న్, సంయుక్త మీన‌న్ ప‌ర్‌ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్ర‌తి ఒక్క‌రు న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా విష‌యంలో కొంద‌రు టెక్నీషియ‌న్స్ ఆవేదన చెందుతున్నారు. అందుకు కార‌ణం మొదట్లో యూట్యూబ్ ను ఊపేసిన అంత ఇష్టం ఏందయ్యా సాంగ్ తొల‌గించ‌డ‌మే. బ‌య‌ట సాంగ్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ రాగా, సినిమాలో మాత్రం లేక‌పోవ‌డం కొంద‌రిని భాదించింద‌ట‌.

Advertisement

ఇటీవ‌ల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాగర్ కే చంద్రను ఈ సాంగ్ విషయం అడిగారు. డైరెక్టర్ రెస్పాండ్ అయ్యి అసలు ఆ సాంగ్ ని షూట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం రికార్డు మాత్రమే చేశామని, ఆ తర్వాత ఆ సాంగ్ ఈ కథకు వర్కౌట్ కాదని షూటింగ్ చేయలేదని స్పష్టం చేశారు. అంటే ఆ సాంగ్ ఈ సినిమాలో ఉండే అవకాశం లేదని తేలిపోయింది. తమన్ సైతం ఇదే విషయమై సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానంగా …మండుతున్న స్టౌవ్ పై నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది అంటూ త‌మ‌న్ ఎదురు ప్ర‌శ్న వేశారు. త‌మ‌న్ స‌మాధానం చూస్తే సినిమా మాస్ యాక్ష‌న్ తో కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఆ పాట క‌రెక్ట్ కాక‌పోవ‌డంతో తొల‌గించిన‌ట్టు క‌నిపిస్తోంది. కాకపోతే ఆ సాంగ్ మాత్రం ఆడియో పరంగా పెద్ద హిట్ అయింది.

nitya menon angry on bheemla nayak team

Advertisement

Bheemla Nayak : నిత్యా హ‌ర్ట్ అయింద‌ట‌…

ఈ సాంగ్ విషయంలో నిత్య హర్ట్ అయిందనే టాక్ నడుస్తోంది. పవన్‌పై ప్రేమతో నిత్యామీనన్ వైపు నుంచి వచ్చే పాట ఇది. అయితే తనకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందనుకున్న ఈ పాటను కట్ చేయడం నిత్యామీనన్‌కి నచ్చలేదట. దీనిపై చాలా ఫీలైందట కూడా. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆమె దూరంగా ఉందని తెలుస్తోంది. చిత్రంలో భీమ్లా నాయక్ భార్య పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో నిత్య రోల్, ఆమె డైలాగ్స్ ప్రేక్షకుల బాగా కనెక్ట్ అయ్యాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి