Nivita Manoj : పవన్ కళ్యాణ్ పెట్టుకున్న మాస్క్‌ని వాడిన నటి.. ఆయన ఎంగిలి అంటే ఇష్టం అంటూ కామెంట్.. వీడియో !
ప్రధానాంశాలు:
Nivita Manoj : పవన్ కళ్యాణ్ పెట్టుకున్న మాస్క్‌ని వాడిన నటి.. ఆయన ఎంగిలి అంటే ఇష్టం అంటూ కామెంట్..!
Nivita Manoj : hari hara veera mallu నాలుగు రోజుల క్రితం వరకూ నివేతా పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అప్పుడెప్పుడో ‘డార్లింగ్’ మూవీలో చిన్న పాత్రలో నటించిన ఈమె.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది. ఒక సీరియల్ లోనూ లీడ్ రోల్ కూడా చేసింది. ఈ క్రమంలో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. సక్సెస్ మీట్ లో పవన్ పాదాలకు నమస్కరించి, ఆయన్ను పట్టుకొని ఫోటో దిగి స్టేజ్ మీదే ఎగిరి గంతులేసింది.

Nivita Manoj : పవన్ కళ్యాణ్ పెట్టుకున్న మాస్క్‌ని వాడిన నటి.. ఆయన ఎంగిలి అంటే ఇష్టం అంటూ కామెంట్.. వీడియో !
Nivita Manoj : మరీ ఇంత పిచ్చా..
ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా నివేతా మనోజ్ వార్తల్లోకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ తో ఫ్యాన్ మూమెంట్ తర్వాత నివేతా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ తాగి పడేసిన వాటర్ బాటిల్ ని దాచుకున్నట్లు చెప్పిన నివేతా.. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా ఆ బాటిల్ ని తనతో పాటుగా తీసుకెళ్తోంది. ఆయనతో ఒక్క సినిమా చేసి చచ్చిపోయినా చాలని, ఇంకే సినిమా చేయకపోయినా ఫర్వాలేదని అంటోంది.
సెట్స్ లో పవన్ కళ్యాణ్ వాడి పక్కనపెట్టిన మాస్క్ ని తెచ్చుకొని దాచుకున్నానని, ఆయన ముక్కుకి పెట్టుకున్న మాస్క్ తీసుకొని తన ముక్కుకి పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పింది. ఆయన ఎంగిలి చేసిన వాటర్ బాటిల్ అంటే తనకెంతో ఇష్టమని, ఆ బాటిల్ తన మనసుకు ఎంతో దగ్గరైందని తెలిపింది. 35 రోజులపాటు ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పింది. ప్రతీరోజూ సెట్స్ లో పవన్ కళ్యాణ్ ను చూస్తానని, మాట్లాడతాననే ఉత్సాహం ఉండేదన్నారు. పవన్ తనతో మాట్లాడకపోయినా ఆయన పీల్చిన గాలిని తానూ పీలుస్తాను.. ఆయన స్మెల్ చేసిన ఇసుకను తానూ స్మెల్ చేస్తాను అని చెబుతూ మురిసిపోయింది.
