YS jagan : నో ‘బెనిఫిట్’ షోస్.. సినీ పెద్దలు, అగ్రహీరోలకు జగన్ నవ్వుతూనే ఇచ్చిపడేశాడుగా..!
YS jagan : ఏపీ సీఎం జగన్ ఎవ్వరి మనసును నొప్పించరు. కానీ సంచలన నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే అంతే ఫైనల్.. మరోసారి నిర్ణయం ఉండదు. తన వద్దకు ఎవరైనా వచ్చి ఫేవర్ అడిగితే సకల మర్యాదలు చేసి నవ్వుతూ సమాధానం ఇస్తారు. కటువుగా మాట్లాడి నొప్పించారు. నోటి ద్వారా సమాధానం చెప్పరు. ఓన్లీ చేతలే.. మనమే అర్థం చేసుకోవాలి. జగన్ ఎవరి మాట వినరని.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను ఇకపై ప్రభుత్వమే నిర్ణయించడంతో పాటు ఆన్‌లైన్ టికెటింగ్ విధానం, బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి వీళ్లదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయాన్ని కొందరు సినీ పెద్దలు ఆహ్వానిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.
ఏపీలో ఎక్కువ శాతం సినిమా థియేటర్లు, చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యాపారులు కమ్మ వర్గం చేతిలోనే ఉన్నాయి. వీరంతా విశాఖలో భూములు, థియేటర్లను పెద్ద ఎత్తున చేజిక్కించుకున్నారు. వాటిని సాధారణ, డీలక్స్, ఏసీ, నాన్ఏసీ, మల్టీపెక్సులుగా విభజించారు. ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా టికెట్ ధరలు నిర్ణయించారు. టిక్కెట్ల ధరల విషయం, చిత్ర పరిశ్రమ తరలింపునకు సంబంధించి పన్నుల రూపంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు జగన్ ను పలుమార్లు కలిశారుట. అయితే, వారు కోరిన కోరికలకు జగన్ జస్ట్ నవ్వి ఊరుకున్నారట. జగన్ తాజా నిర్ణయంతో ఏకంగా కమ్మ వర్గం వారికి భారీ షాకిచ్చారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
YS jagan : వారికి జగన్ ‘కమ్మ’ని దెబ్బ కొట్టాడుగా..
కాగా, తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం సినీ పెద్దల విన్నపాలను సీఎం జగన్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా టికెట్ల విషయంలో జగన్ తీసుకున్న సినీ పెద్దలకు షాకింగా మారగా.. ప్రజలకు మాత్రం మేలు చేస్తుందట.. కేటగిరీల వారిగా సినిమా థియేటర్లలో రూ.5 నుంచి టెకెట్ల ధరలను జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివలన అగ్రహీరో, భారీ బడ్జెట్ చిత్ర నిర్మాతలు నష్టపోవాల్సి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు.అయితే, బెనిఫిట్ షోస్ వలన ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గుతుందని వాటిని క్యాన్సిల్ చేసిందట.. ఇక టిక్కెట్ల అమ్మకాల్లో అవకతవకలను గుర్తించిన ప్రభుత్వం అందుకే ఆన్‌లైన్ సిస్టమ్‌ను అమలు చేసేందుకు సిద్ధపడిందట..