Naga Chaitanya : సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంతలు తప్ప మరెవ్వరు విడాకులు తీసుకోలేదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Chaitanya : సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంతలు తప్ప మరెవ్వరు విడాకులు తీసుకోలేదా?

Naga Chaitanya : సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య మరియు సమంత తప్ప మరెవ్వరు విడాకులు తీసుకోలేదు అన్నంతగా వారి ఇద్దరి గురించి మీడియాలో ప్రచారం జరగడం విడ్డూరంగా ఉంది అంటూ అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా వారిద్దరి విడాకుల గురించి మీడియాలో ఎడతెరపి లేకుండా కథనాలు వస్తూనే ఉన్నాయి. పైగా వారిద్దరు ఏం చేసినా కూడా విడాకులతో ముడిపెడుతూ అందుకే విడాకులు తీసుకున్నారు.. ఇందుకు విడాకులు తీసుకున్నారు అంటూ ఎవరికి వచ్చినట్లుగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 August 2022,11:30 am

Naga Chaitanya : సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య మరియు సమంత తప్ప మరెవ్వరు విడాకులు తీసుకోలేదు అన్నంతగా వారి ఇద్దరి గురించి మీడియాలో ప్రచారం జరగడం విడ్డూరంగా ఉంది అంటూ అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా వారిద్దరి విడాకుల గురించి మీడియాలో ఎడతెరపి లేకుండా కథనాలు వస్తూనే ఉన్నాయి. పైగా వారిద్దరు ఏం చేసినా కూడా విడాకులతో ముడిపెడుతూ అందుకే విడాకులు తీసుకున్నారు.. ఇందుకు విడాకులు తీసుకున్నారు అంటూ ఎవరికి వచ్చినట్లుగా వారు ఊహించుకుంటూ వారిని ఇబ్బంది పెడుతున్నారు.

వారి వ్యక్తిగత విషయాలను రాద్దాంతం చేయడంతో పాటు వారి కెరీర్ ను కూడా ఇబ్బంది పెట్టడమే కాకుండా సినిమా ఇండస్ట్రీని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విడాకులు అనేది వారి వ్యక్తిగత విషయము.. వారు కలిసి బతకలేము అనే కారణంతో విడాకులు తీసుకున్నారు. అందుకు కారణాలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా కూడా మీడియా అత్యుత్సాహం విడాకులకు సంబంధించి అధిక వార్తా కథనాలు ప్రచురితం చేస్తుంది అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

None other than Naga Chaitanya and Samantha have divorced in the film industry

None other than Naga Chaitanya and Samantha have divorced in the film industry?

ముఖ్యంగా సోషల్ మీడియాలో నాగ చైతన్య మరియు సమంత గురించి ఇంకా కూడా ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. సమంత ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆమెని విమర్శిస్తూ కొందరు.. నాగచైతన్య ని విమర్శిస్తూ మరి కొందరు కామెంట్ చేస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో వీరు కాకుండా మరెవరు విడాకులు తీసుకోలేదు అన్నంతగా వారిద్దరి పైనే మీడియా ఫోకస్‌ ఉంది. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీడియా వారు మరియు సోషల్ మీడియా జనాలు ఆలోచిస్తే బెటర్.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది