Nooka raju Father Funny COmments on Anchor Rashmi
జబర్దస్త్ కమెడియన్లతో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా బుల్లితెరకు బాగా సుపరిచితమే. నూకరాజు తండ్రి, బుల్లెట్ భాస్కర్ ఫాదర్, పంచ్ ప్రసాద్ భార్య, ఆటో రాం ప్రసాద్ ఫ్యామిలీ ఇలా అందరూ కూడా ఇది వరకు షోలో కనిపించి బాగానే ఫేమస్ అయ్యారు. ఇక అందరి కంటే ఎక్కువ అంటే.. బుల్లెట్ భాస్కర్ తండ్రి బాగా ఫేమస్ అయ్యాడు. అనేక స్కిట్లలో కూడా కనిపించాడు.బుల్లెట్ భాస్కర్ పరువు తీయడంలో తండ్రి ముందుంటాడు. దారుణమైన సెటైర్లుతో బుల్లెట్ భాస్కర్‌ను ఆడుకుంటాడు. అలా ఈ వారం కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్లు రాబోతోన్నారు.ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ షోను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కమెడియన్ల తండ్రులను తీసుకొచ్చారు.
ఇందులో భాగంగా పవిత్ర, రష్మీ, వర్ష వంటి వారు బాగానే ఫీలయ్యారు.ఎందుకంటే వీరికి తండ్రి లేరు. తన తండ్రి తాగుబోతు అని, అందుకే మాట్లాడే దాన్ని కాదు. కనీసం తాకే దాన్ని కూడా కాదు. చనిపోయిన తరువాత కాళ్లకు ముట్టుకున్నాను అంటూ పవిత్ర తెగ ఎమోషనల్ అయింది. వర్ష సైతం అలానే తన తండ్రిని తలుచుకుంటూ కన్నీరు పెట్టేసింది. కానీ బుల్లెట్ భాస్కర్ తండ్రి మాత్రం వచ్చీ రాగానే పంచ్ వేశాడు. ఇంట్లో ఉన్న కుక్కనే కంట్రోల్ చేయలేకపోతోన్నా.. వీధుల్లోని కుక్కలను ఏం కంట్రోల్ చేస్తాను అని అంటాడు. అంటే నన్ను కుక్కతో పోల్చుతున్నావా? నాన్న అని బుల్లెట్ భాస్కర్ అడుగుతాడు.
Nooka raju Father Funny COmments on Anchor Rashmi
చీ చీ గట్టిగా అనకురా.. అవి బాధపడతాయ్ అని బుల్లెట్ భాస్కర్ పరువుతీస్తాడు తండ్రి. ఇక మరో వైపు నూకరాజు తండ్రి రెచ్చిపోతాడు. రత్తాలు ఇంటికి వెళ్తే కొట్టారట ఎందుకు నాన్న. అని అడుగుతాడు నూకరాజు. డోర్ కొట్టినందుకు కొట్టారురా అని అంటాడు. డోర్ కొడితే ఎందుకు కొడతారు.. అయినా కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా? అని నూకరాజు అంటాడు. బాత్రూం డోర్‌కు కాలింగ్ బెల్ ఎందుకు పెట్టుకుంటారురా? అని కౌంటర్ వేస్తాడు. మరో సందర్భంలో రష్మీ కోసం వచ్చానని అంటాడు.. ఇంకో సందర్భంలో అదిరిపోయిందని రష్మీని చూసుకుంటూ అంటాడు.. కానీ సేమ్య అదిరిపోయిందని కవర్ చేసేస్తాడు.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.