Home » Entertainment » Ntr Wife Enter Into Social Media
Entertainment

Jr NTR : ట్విట్ట‌ర్‌లో ఫ‌స్ట్ పోస్ట్‌తోనే ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 29, 2022, 8:37 am
Advertisement

Jr NTR : ఒక‌ప్పుడు సినిమా సెల‌బ్రిటీల గురించి అభిమానుల‌కి ఎలాంటి స‌మాచారం ఉండేది కాదు. కాని సోష‌ల్ మీడియా యుగం మొద‌ల‌య్యాక వారు త‌మ‌కు సంబంధించిన ప్ర‌తి స‌మాచారం కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నారు. హీరోలే కాదు వారి భార్య‌లు కూడా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నారు. బ‌న్నీ బార్య స్నేహా రెడ్డి అయితే ఇన్‌స్టాలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ సంపాదించి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భార్య కూడా సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి నంద‌మూరి అభిమానుల‌ని సంతోషింప‌జేసింది.

Advertisement

ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి మొద‌టి పోస్ట్‌గా త‌న భ‌ర్త ఎన్టీఆర్‌తో క‌లిసి దిగిన క్యూట్ ఫొటో షేర్ చేసింది. మీ అంద‌రితో క‌లిసి ట్విట్ట‌ర్లో జాయిన్ అవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది… మొద‌టి ట్వీట్ నా లవ్లీ భ‌ర్త‌తో క‌లిసి పోస్ట్ చేస్తున్నాను అని ఆమె ట్వీట్ చేయ‌డంతో పాటు త‌న భ‌ర్త ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసింది. ప్ర‌ణ‌తి అలా ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో 24 గంట‌ల‌లోనే 3 వేల మంది ఫాలోవ‌ర్స్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ల‌క్ష్మీ ప్ర‌ణ‌తికి గ్రాండ్ వెల్ క‌మ్ చెబుతున్నారు నెటిజన్స్. రానున్న రోజుల‌లో ప్ర‌ణ‌తి త‌న ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ తో ర‌చ్చ చేయ‌నుంది.

Jr ntr wife enter into social media

Advertisement

Jr NTR  గుడ్ న్యూస్..

ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసిన జూనియర్ .. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌కత్వంలో ఓ మూవీ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు చెప్పిన స్టోరీ లైన్ కి ఎన్టీఆర్ ఇంప్రెస్ అయ్యాడట. ఉప్పెన పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు ఎన్టీఆర్ కి కథ చెప్పారు. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు మేకింగ్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆల్రెడీ కొరటాల శివ, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి కమిటై ఉన్నాడు. ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ‌తాయో, ఎప్పుడు విడుద‌ల అవుతాయో తెలియాల్సి ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి