Senior NTR vs Nageswara Rao : సీనియర్ ఎన్టీఆర్ vs నాగేశ్వరావు గొడవ మళ్ళీ ఎందుకు వచ్చింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Senior NTR vs Nageswara Rao : సీనియర్ ఎన్టీఆర్ vs నాగేశ్వరావు గొడవ మళ్ళీ ఎందుకు వచ్చింది !

 Authored By kranthi | The Telugu News | Updated on :28 April 2023,7:00 pm

Senior NTR vs Nageswara Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ రెండు కళ్ల లాంటి వారు. ఇప్పుడు కాదు వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, బతికి ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్లను అంత గౌరవంగా చూసుకునేది. వాళ్లు ఈ లోకంలో లేకపోయినా కూడా ఇండస్ట్రీ ఇప్పటికీ వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తోంది. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వాళ్లు. నిజానికి అప్పట్లోనే తెలుగు సినిమా గురించి దేశం మాట్లాడుకునేలా చేశారు వాళ్లు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ మంచి మిత్రులు. వాళ్లు స్టార్ హీరోలుగా ఎదిగినా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉండేవి కావు. ఇద్దరూ కలిసి కూడా చాలా సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం కూడా తెలిసిందే.

once again senior ntr vs anr battle came to light

once again senior ntr vs anr battle came to light

వీళ్లు ఇప్పుడు లేరు కానీ.. వీళ్ల కుటుంబాల మధ్య వైరం పెరుగుతోంది. ఆ మధ్య బాలకృష్ణ.. అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడం, దానికి నాగ చైతన్య, అఖిల్ స్పందించడం ఇలా చాలా దూరమే వెళ్లింది ఆ విషయం. ఆ ఘటనపై నాగార్జున స్పందించలేదు, అలాగని అలాంటి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ కూడా క్షమాపణలు చెప్పలేదు. అప్పటి వరకు ఆ విషయం సద్దుమణిగింది కానీ.. ఈ మధ్య మళ్లీ ఆ మ్యాటర్ తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కోసం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నారు.

Superstar Krishna and NTR: A love-hate relationship with a happy ending

Senior NTR vs Nageswara Rao : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ప్లాన్

ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని పోరంకిలో ఉన్న అనుమోలు గార్డెన్ లో ఈ వేడుకలను నిర్వహిస్తుండగా.. ఈ వేడుకల్లో ఓవైపు బాలకృష్ణ, చంద్రబాబు, రజనీకాంత్ ఈ ముగ్గురూ పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఇదంతా పక్కన పెడితే వచ్చే సంవత్సరం ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలను కూడా నిర్వహించేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వేడుకలకు పోటీగా ఏఎన్నార్ ఉత్సవాలను జరపాలని.. అనుకుంటున్నారట. అంతకుమించి జరపాలని అనుకుంటున్నారట. వార్నీ.. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న వివాదం సద్దుమణిగింది అనుకుంటే మళ్లీ రగులుకున్నట్టుంది అని ఇండస్ట్రీ గుసగుసలాడుకుంటోంది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది