Oscars Awards 2025 : ఆస్కార్ 2025 విజేతల లిస్ట్ ఇదే.. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ
ప్రధానాంశాలు:
Oscars Awards 2025 : ఆస్కార్ 2025 విజేతల లిస్ట్ ఇదే.. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ
Oscars Awards 2025 : ప్రపంచ చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ‘ఆస్కార్’ Oscars అవార్డ్స్ 2025 విజేతలను తాజాగా ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా), ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ (అనోరా) అవార్డులు దక్కించుకున్నారు.

Oscars Awards 2025 : ఆస్కార్ 2025 విజేతల లిస్ట్ ఇదే.. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ
Oscars Awards 2025 అవార్డుల ప్రధానోత్సవం..
ఇక ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్), ఉత్తమ సహా నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్), ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనోరా (సీన్ బేకర్) , ఉత్తమ ఎడిటింగ్ – అనోరా (సీన్ బేకర్), ఉత్తమ సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే), ఉత్తమ సౌండ్ – డ్యూన్: పార్ట్2, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్:పార్ట్2, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్), ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – ఐయామ్ స్టిల్ హియర్ బ (వాల్టర్ సాల్లెస్) చిత్రాలకి దక్కాయి.
ఇక ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఐయామ్ నాట్ ఏ రోబో, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – నో అదర్ ల్యాండ్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్ చిత్రాలకి అవార్డులు దక్కాయి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ Dolby Theatre థియేటర్‌లో జరుగుతున్న 97వ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.