Vangaveeti Radha Krishna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త సమీకరణలు, వంగవీటి రాధాకు గ్రీన్ సిగ్నల్ !
ప్రధానాంశాలు:
Vangaveeti Radha Krishna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త సమీకరణలు, వంగవీటి రాధాకు గ్రీన్ సిగ్నల్ !
Vangaveeti Radha Krishna : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే ఎన్నిక ముగిసింది. ఈ నెల 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. కూటమికి ఏకపక్షంగా బలం ఉండడంతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు వారికే దక్కనున్నాయి.
నాగబాబుకు ఖాయం
అయితే ఈ ఐదు ఎమ్మెల్సీ పదవుల్లో మెగా బ్రదర్ నాగబాబుకు Nagababu ఒకటి ఖాయం అయ్యింది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక సమయం లో చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కావటం లాంఛనంగానే కనిపిస్తోంది. దీంతో జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయమని తేలిపోయింది.
సమీకరణల దృష్ట్యా ఆ ఇద్దరికి నో
అయితే ఈసారి వంగవీటి రాధాకృష్ణకు vangaveeti Radhakrishna ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన హామీతోనే టిడిపిలో చేరారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే రాధాకృష్ణకు తప్పకుండా పదవి దక్కుతుందని సమాచారం. ఒకవేళ రాధాకృష్ణకు పదవి ఖరారు చేస్తే అదే జిల్లాకు చెందిన దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు పిఠాపురం వర్మ కూడా పదవి ఆశిస్తున్నారు. బీసీ కోటాలో యనమల రామకృష్ణుడు తో పాటు బీద రవిచంద్ర ఉన్నారు. అయితే ఈసారి యనమలకు చాన్స్ లేదని తెలుస్తోంది.