Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో
ప్రధానాంశాలు:
Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారామె. ఆమె కష్టాలు, దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan 2 లక్షలు రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు.

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో
Pakiza : మీ ప్రేమకి కృతజ్ఞతలు..
పవన్ సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి సోమవారం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు పాకీజా.
ఇక తాజా ఇంటర్వ్యూలో పాకీజా మాట్లాడుతూ.. ఇంకో జన్మ ఉంటే.. నేను చిరంజీవిగారి ఇంట్లో కుక్కగా పుట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లోని వారు ఎంత మానవత్వంతో, ప్రేమ కురిపిస్తారు. ఆ స్థాయిలో సంస్కారం ఉండే వ్యక్తి అరుదు అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలలో మెగాస్టార్ చిరంజీవి మీద ఆమెకు ఉన్న గౌరవం, అభిమానాన్ని స్పష్టంగా తెలుస్తోంది. ఇది అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది.