Pakiza : అడ‌గ్గానే పాకీజాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్ధిక సాయం.. చిన్న‌వారైన చేతులు ఎత్తి మొక్కేదాన్ని | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pakiza : అడ‌గ్గానే పాకీజాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్ధిక సాయం.. చిన్న‌వారైన చేతులు ఎత్తి మొక్కేదాన్ని

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2025,6:40 pm

ప్రధానాంశాలు:

  •  Pakiza : అడ‌గ్గానే పాకీజాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్ధిక సాయం.. చిన్న‌వారైన చేతులు ఎత్తి మొక్కేదాన్ని

Pakiza  : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో బ్రహ్మానందం, పాకీజాల లవ్ ట్రాక్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంటుంది. సినిమాల్లో ఎంతోమందిని నవ్వించిన పాకీజా ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉందని బయటకు రావడం ఎంతోమందిని కలిచివేసింది.

Pakiza అడ‌గ్గానే పాకీజాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్ధిక సాయం చిన్న‌వారైన చేతులు ఎత్తి మొక్కేదాన్ని

Pakiza : అడ‌గ్గానే పాకీజాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్ధిక సాయం.. చిన్న‌వారైన చేతులు ఎత్తి మొక్కేదాన్ని

Pakiza  : మంచి హృద‌యం..

మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన వాసుకి అలియాస్ పాకీజాకి పవన్ కళ్యాణ్ రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆయన పేరు మీద శాసనమండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ అందించిన ఈ సాయంపై పాకీజా భావోద్వేగానికి గురయ్యారు.

తాను కష్టాల్లో ఉన్నానని తెలియగానే తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్‌కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదని.. ఆయన తనకంటే చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లకు మొక్కేదాన్నని ఎమోషనల్ అయ్యారు. తనకు సాయం చేసిన పవన్ కళ్యాణ్‌కి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆమె వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ స్పందించి ఆమెకు రూ.2లక్షల ఆర్థిక సాయం చేయ‌డంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది