Prabhas Marriage : ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. పెళ్లికూతురు ఎవరంటే?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 4, 2023, 8:00 pm

Prabhas Marriage : ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడాలంటే అందరూ చర్చించే విషయం ఒక్కటే. అదే ఆయన పెళ్లి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్థాయి నుంచి కూడా దాటి నాలుగు పదుల వయసు కూడా వచ్చేసింది ప్రభాస్ కి. కానీ.. తన పెళ్లి విషయంపై మాత్రం ఇప్పటి వరకు ప్రభాస్ క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి బాహుబలి సిరీస్ షూటింగ్ పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ.. ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ లాంటి సినిమాల షూటింగ్ లో బిజీ అయ్యారు.

వాటి తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ కే, సలార్ లాంటి సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మధ్య ప్రభాస్, అనుష్క మధ్య ఏదో ఉందని.. బాహుబలి టైమ్ లోనే పెద్ద టాక్ నడిచింది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ.. వాటిలో ఏమాత్రం నిజం లేదని చాలాసార్లు ఇద్దరూ తేల్చి చెప్పారు. అయినా కూడా ఇద్దరూ సీక్రెట్ గా కలుసుకుంటూనే ఉంటారు. వాళ్ల మధ్య ఏముంది అనేది పక్కన పెడితే ప్రభాస్ త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ ఎన్నో అంచనాలతో నటించిన సలార్ మూవీ షూటింగ్ పూర్తవడంతో ఇక తన ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయట. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాకుండా తన బంధువుల అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

pan india star prabhas marriage date fixed

Prabhas Marriage : ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. పెళ్లికూతురు ఎవరంటే?

Prabhas Marriage : అనుష్కను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్

కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ప్రభాస్ కు సంబంధం చూసినట్టు తెలుస్తోంది. ఒక ఫంక్షన్ లో ప్రభాస్ పెద్దమ్మకు ఆ యువతి తల్లిదండ్రులు ఆమె ఫోటో చూపించారట. ఆ ఫోటో చూసిన శ్యామలాదేవికి ఆ అమ్మాయి నచ్చిందట. ఈడుజోడు కూడా బాగుంటుందని ఆమె భావించారట. ప్రభాస్ కూడా ఆమె ఫోటో చూసి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ యువతి ప్రస్తుతం అమెరికాలో బిజినెస్ కి సంబంధించిన కోర్సు చేస్తుందట. చదువు పూర్తవగానే ఇండియాకు వచ్చేస్తుందట. రాగానే ప్రభాస్ తో పెళ్లి జరగనుందట. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు. అయ్యో.. అనుష్కను చేసుకోవడం లేదా అని బాధపడుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp