
Parasuram : పరశురామ్ .. దర్శకుడిగా ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సినిమాలకి దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలం అయినా నెమ్మదిగా కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు పరశురామ్. 2008 లో యంగ్ హీరో నిఖిల్ నటించిన యువత సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత రవితేజ తో రెండు సినిమాలు … నారా రోహిత్ తో ఒక సినిమా..అల్లు శిరీష్ తో ఒక సినిమా.. విజయ దేవరకొండ తో ఒక సినిమా చేశాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో చేసిన గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీలో బాగా పాపులారిటీని తెచ్చుకున్నాడు. గీతా ఆర్ట్స్ లో నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల కి పైగా వసూళ్ళు రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది.
దాంతో పలువురు హీరోలు పరశురామ్ తో సినిమా చేయాలని అనుకున్నారు. కాని ఎందుకనో పరశురామ్ కి ప్రాజెక్ట్ సెట్ అవడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అంత సమయం పట్టినా కూడా ఏకంగా మూడు పెద్ద నిర్మాణ సంస్థలు … మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు. సర్కారు వారి పాట అన్న టైటిల్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి పరశురామ్ మీద ఇండస్ట్రీ మొత్తం ఆసక్తికరంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టింది. మహేష్ బాబు .. పరశురామ్ కి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా అతనిలో ఏదో ఉంది అని చెప్పుకున్నారు.
ఆ విషయం ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ నుంచి లీకైన పిక్ ని బట్టి తెలుస్తోంది. ఇక తాజాగా లీకైన ఫొటోస్ చూస్తుంటే భారీ యాక్షన్ అండ్ ఛేజింగ్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ యాక్షన్ కొరియేగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ హోదా వచ్చినప్పటికి నేల మీద కూర్చోని ఎలాంటి సౌకర్యాలు లేకుండా మహేష్ బాబు కి సీన్ వివరిస్తునాడు. ఇలాంటి వర్కింగ్ స్టిల్స్ చూస్తే ఎలాంటి హీరోలైనా.. నిర్మాతలైనా ఆ దర్శకుడి కి ఫిదా కావాల్సిందే. ఇప్పుడు పరశురామ్ విషయంలో కూడా ఇండస్ట్రీ వర్గాలు అభిమానులు అదే మాట్లాడుకుంటున్నారు. కాగా మహేష్ బాబు – పరశురామ్ ల సర్కారు వారి పాట లో కీర్తి హీరోయిన్ గా నటుస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.