Home » Entertainment » Paruchuri Venkateswara Rao New Look Viral
Entertainment

Paruchuri Venkateswara Rao : పరుచూరి ఏంది ఇలా అయిపోయాడు.. ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు

Authored By
Sam C
The Telugu News | Published on: March 12, 2022, 7:00 pm
Advertisement

Paruchuri Venkateswara Rao :తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పరుచూరి బ్ర‌ద‌ర్స్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. ఇద్ద‌రు ర‌చ‌యిత‌లుగానే కాక న‌టులుగాను మంచి పేరు ప్రఖ్యాత‌లు పొందారు. ఎన్నో సినిమాల‌కు అద్భుత‌మైన డైలాగ్స్ అందించి త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300 సినిమాలకు పైగా రచన చేసిన ఈ ఇద్దరూ.. గుర్తుండిపోయే మాటలు పని చేసారు. ఎన్నో సినిమాలకు కథ, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం కూడా వహించారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో పని చేసిన అనుభవం వీళ్ల సొంతం. మొన్నటికి మొన్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150 వరకు ఎన్నో సినిమాలకు రాసారు వాళ్లు. అయితే ఈ మధ్య కాలంలో వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Advertisement

పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు (80) ప్రస్తుతం వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కనీసం బయటకు కూడా రావడం లేదు. అయితే ఇటీవలే ఆయనని కలిసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ పరుచూరి వెంకటేశ్వరరావుతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పిక్ చూసి అందరు షాక్ అవుతున్నారు.. వెంకటేశ్వరరావు గారు ఇలా అయ్యరెంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..1981లో పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ లకు ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి, తన సొంత చిత్రం ‘అనురాగదేవత’ ద్వారా రచయితులగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఎన్టీఆర్.

paruchuri venkateswara rao new look viral

Advertisement

Paruchuri Venkateswara Rao : ఇలా అయిపోయాడేంటి..

పరుచూరి గోపాలకృష్ణ మాత్రం యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతూ సినిమా రివ్యూస్ చెప్తున్నాడు. మరోవైపు వెంకటేశ్వర రావు మాత్రం దూరంగానే ఉన్నాడు. ఈ మధ్య బయటికి కూడా రావడం లేదు ఈయన. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా కొందరు పరుచూరిని కొన్ని రోజులుగా చూడటం లేదు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఆయన దర్శనమే లేకుండా పోయింది. పైగా కొన్నేళ్ల కింద ఆయన భార్య చనిపోయారు. అప్పట్నుంచి మరింత కుంగిపోయారు పరుచూరి వెంకటేశ్వరరావు. దానికితోడు వయోభారంతోనూ బాధ పడుతున్నారు. ఇవన్నీ ఈయన మొహంలోనే కనిపిస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి