RRR Movie New promo song out
RRR Movie : ఇప్పుడు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎక్కువగా జపిస్తోన్న పేరు ‘ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడి.. ఈ నెల 25న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచింది. ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథెమ్ అంటూ “ఎత్తర జెండా” అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. మార్చ్ 14న ఈ సాంగ్ తో సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేయనున్నారు రాజమౌళి అండ్ టీం.
తాజాగా ఈ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్,అలియా భట్, ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ముగ్గురూ ఫుల్ ఖుషీగా సెలెబ్రేషన్స్ మోడ్ లో కన్పిస్తున్నారు. 5 భాషల్లో ఈ సాంగ్ విడుదల కాగా, ఈ సాంగ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్ , అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు.
RRR Movie New promo song out
ముందుగా ఈ సినిమాను నిర్మాత దానయ్య రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్‌లో జాప్యంతో పాటు ప్రమోషన్స్ అన్ని కలిపి దాదాపు రూ. 400 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. మార్చి 25న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రెండవ రౌండ్ ప్రొమోషన్లకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు.
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
This website uses cookies.