
Pavala shyamala comments on jabardast hyper Aadi
Pavala Shyamala : జబర్దస్త్ నటుడు, రచయిత, సినీ నటుడు అయినా హైపర్ ఆది పై సీనియర్ నటి పావలా శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది తన ఫోటోను చనిపోయిన వాళ్ళ ఫోటోల పక్కనపెట్టి తాను కూడా చనిపోయినట్లు చిత్రీకరించాడు అని పావలా శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కిట్ చూసినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని అన్నారు. రంగస్థలం నుంచి బుల్లితెర మీదిగా వెండితెర పైకి వచ్చిన పావలా శ్యామల తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ప్రస్తుతం పావలా శ్యామల దీనస్థితిలో ఉన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామల అపద హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. తనతో పాటు తన కూతురుకి కూడా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని శ్యామల చెబుతున్నారు. శ్యామల పరిస్థితిని బయట ప్రపంచానికి చెప్పడానికి పలు యూట్యూబ్ ఛానల్ లు ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో గురించి, హైపర్ ఆది గురించి స్పందించారు. పావలా శ్యామల చనిపోయారంటూ ఆ మధ్య తప్పుడు వార్తలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. తాను చనిపోలేదని, అనారోగ్యం పాలయ్యానని చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇలాంటి రూమర్లు రావడానికి ఒకరిద్దరూ కారణం కాదని అందరూ ఇలానే ఉన్నారని శ్యామల అంటున్నారు.
ఆఖరికి జబర్దస్త్ షో లో సైతం చనిపోయిన వాళ్ళ పక్కన తన ఫోటోను పెట్టి తాను కూడా చనిపోయానని భావన కల్పించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జబర్దస్త్ లో ఆది అని ఉంటాడు కదా రశ్మిని అడుగుతుంటాడు నిర్మలమ్మ ఫోటో మనోరమ ఫోటో పక్కన నా ఫోటో పెట్టి ఈవిడ ఎవరో తెలుసా ఆమె కూడా ఇప్పుడు లేరని చెప్పేశాడు. పోయిన వాళ్ళ పక్కన మన ఫోటోను పెడితే మనం కూడా పోయామని చెప్పడమే కదా ఇలా చేయడం వలన వాళ్లకు ఏంటి ప్రయోజనం. నడవలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను జబర్దస్త్ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లి అలా ఎందుకు మాట్లాడావ్, నీతో ఎవరు మాట్లాడించారు అని అడగగలనా లేదా ఆది దొరుకుతాడా లేదా నాకు ఫోన్ చేసి ఉన్నానా లేదా అని అడిగాడా అంటూ పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. తాను బ్రతికే ఉన్నానని తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తూ తనని బాధ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.