Pavala Syamala : జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు దగ్గరకు సహాయం కోసం వెళ్తే వాళ్ళు ఎలా ప్రవర్తించారో చెప్పిన పావలా శ్యామల..!

Authored By aruna | The Telugu News | Published on: February 2, 2024, 4:00 pm
  •  Pavala Syamala : జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు దగ్గరకు సహాయం కోసం వెళ్తే వాళ్ళు ఎలా ప్రవర్తించారో చెప్పిన పావలా శ్యామల..!

Pavala Syamala : నటి పావలా శ్యామల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ‘ బాబాయ్ అబ్బాయ్ ‘ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె నటిగా ఎన్నో సినిమాలలో నటించారు. అయితే ఆమె అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలలో నటించిన సమయంలో ఆర్థికపరమైన విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం వలన ప్రస్తుతం ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఎన్నో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆమెకు మెగాస్టార్ చిరంజీవి సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పావలా శ్యామల తెలిపారు. చిరంజీవి ప్రతినెల తనకు కొంత అమౌంట్ వచ్చే సహాయం చేశారని ఇదివరకు కూడా ఆమె పేర్కొన్నారు.

అయితే తాజా ఇంటర్వ్యూలో పావలా శ్యామల జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్థిక సహాయం కోసం మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళితే వాళ్ళు ఇంట్లో లేరని అబద్ధాలు చెబుతున్నారని ఫోన్ నెంబర్లు కూడా తప్పుగా ఇస్తున్నారని, దీంతో వాళ్లను కలవడం కుదరడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సహాయం చేశారని, ఎవరు సహాయం చేయలేదని తెలిపారు. తనకు మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు పది లక్షల రూపాయల వరకు సహాయం చేశారని వస్తున్న వార్తలకు ఆమె ఈ విధంగా చెక్ పెట్టారు. తనకు ఎవరూ డబ్బు సహాయం చేయలేదని ఆమె తెలిపారు. తనకు ఈ విధంగా డబ్బు సహాయం చేశారు అంటూ వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం వలన తనకు సహాయం చేసే వారు కూడా చేయరు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విధంగా తనకు ఎవరు కూడా ఆర్థికపరమైన సహాయం చేయలేదంటూ పావలాశ్యామల స్టార్ హీరోల గురించి కామెంట్స్ చేశారు. ఇలా స్టార్ హీరోల గురించి మాట్లాడడంతో పలువురు హీరోల పేర్లు చెప్పుకొని పాపులర్ కావాలని పావల శ్యామల చూస్తుందని, ఆమె గొంతెమ్మ కోరికలను తీర్చడం ఎవరికి సాధ్యం కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వలన తనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని కొందరు వెల్లడించగా మరికొందరు ఆమె ప్రవర్తనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటూ ఆమె గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పావలాశ్యామలా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

aruna

No bio available for this author.

  1. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  2. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  3. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  4. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

  5. "AP Municipal Election Results : ఏపీ మున్సిపల్ ఫలితాలకు అంతా రెడీ.. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు..!"

  6. "Rising Stars Asia Cup 2026 : నవంబర్ 22న మ‌రోసారి భారత్-పాక్ బిగ్ ఫైట్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ!"

  7. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్‌లోకి రోహిత్ రీ ఎంట్రీ? వైరల్‌గా మారిన ఫోటోతో కొత్త ట్విస్ట్ !"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp