
Pavala Syamala : జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు దగ్గరకు సహాయం కోసం వెళ్తే వాళ్ళు ఎలా ప్రవర్తించారో చెప్పిన పావలా శ్యామల..!
Pavala Syamala : నటి పావలా శ్యామల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ‘ బాబాయ్ అబ్బాయ్ ‘ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె నటిగా ఎన్నో సినిమాలలో నటించారు. అయితే ఆమె అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలలో నటించిన సమయంలో ఆర్థికపరమైన విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం వలన ప్రస్తుతం ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఎన్నో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆమెకు మెగాస్టార్ చిరంజీవి సహాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో పావలా శ్యామల తెలిపారు. చిరంజీవి ప్రతినెల తనకు కొంత అమౌంట్ వచ్చే సహాయం చేశారని ఇదివరకు కూడా ఆమె పేర్కొన్నారు.
అయితే తాజా ఇంటర్వ్యూలో పావలా శ్యామల జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్థిక సహాయం కోసం మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళితే వాళ్ళు ఇంట్లో లేరని అబద్ధాలు చెబుతున్నారని ఫోన్ నెంబర్లు కూడా తప్పుగా ఇస్తున్నారని, దీంతో వాళ్లను కలవడం కుదరడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సహాయం చేశారని, ఎవరు సహాయం చేయలేదని తెలిపారు. తనకు మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు పది లక్షల రూపాయల వరకు సహాయం చేశారని వస్తున్న వార్తలకు ఆమె ఈ విధంగా చెక్ పెట్టారు. తనకు ఎవరూ డబ్బు సహాయం చేయలేదని ఆమె తెలిపారు. తనకు ఈ విధంగా డబ్బు సహాయం చేశారు అంటూ వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం వలన తనకు సహాయం చేసే వారు కూడా చేయరు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధంగా తనకు ఎవరు కూడా ఆర్థికపరమైన సహాయం చేయలేదంటూ పావలాశ్యామల స్టార్ హీరోల గురించి కామెంట్స్ చేశారు. ఇలా స్టార్ హీరోల గురించి మాట్లాడడంతో పలువురు హీరోల పేర్లు చెప్పుకొని పాపులర్ కావాలని పావల శ్యామల చూస్తుందని, ఆమె గొంతెమ్మ కోరికలను తీర్చడం ఎవరికి సాధ్యం కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వలన తనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని కొందరు వెల్లడించగా మరికొందరు ఆమె ప్రవర్తనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటూ ఆమె గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పావలాశ్యామలా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…
This website uses cookies.