Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణకి నివాళులు అర్పించి మహేష్ బాబుని ఓదార్చిన పవన్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: November 15, 2022, 3:40 pm

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రం లోకి వెళ్ళిపోయింది. సాంకేతికంగా ఇండస్ట్రీని పైకి తీసుకురావడంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు సినిమాలు కృష్ణ చేయడం జరిగింది. ఈ క్రమంలో రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్న క్రమంలో ఇండస్ట్రీలో షూటింగ్స్ మొత్తం బంద్ అయ్యాయి.

ఇదిలా ఉంటే జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి ఇప్పుడు తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను మహేష్ బాబుని ఓదార్చటానికి… కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు నానక్ రామ్ గుడాలో ఉన్న పార్థివ దేహం వద్దకు వస్తున్నారు.

pawan-consoled-mahesh-babu-by-paying-tribute-to-superstar-krishna

pawan-consoled-mahesh-babu-by-paying-tribute-to-superstar-krishna

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి మహేష్ బాబుని ఓదార్చి కృష్ణ భౌతికకాయానికి దండ వేసి నివాళులు అర్పించారు. కృష్ణ మరణ వార్తతో ఉదయం సోషల్ మీడియా ద్వారా… కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ జనసేన పార్టీ తరుపున ఎమోషనల్ పోస్టు పెట్టడం జరిగింది. అదే సమయంలో ఆయన వ్యక్తిత్వం మరియు ఇండస్ట్రీకి అందించిన సేవలు రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ.. మహేష్ బాబుకి ఇంకా కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp