Pawan Kalyan : ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను వాడేశాడు.. పవన్ కళ్యాణ్ స్పీచ్ అదుర్స్
సాయి ధరమ్ తేజ్ దేవాకట్ట కాంబోలో వస్తోన్న రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ మొత్తానికి పవన్ కళ్యాణ్ సుధీర్ఘ ప్రసంగం హైలెట్ అయింది. ప్రతీ ఒక్క సమస్య గురించి మాట్లాడాడు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం మీద మీడియా రాసిన చిత్రవిచిత్ర కథనాలను ఏకిపారేశాడు. చిత్రపరిశ్రమ మీద ఏపీ ప్రభుత్వం చేస్తోన్న దారుణాలను కడిగిపారేశాడు. థియేటర్ల వ్యవస్థ, టిక్కెట్ల అమ్మకంపై నిప్పులు చెరిగాడు.
Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event
ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan
ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి మాట్లాడాడు. చిత్రపరిశ్రమ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతుంటారు.. కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటామని అంటారు. అవేం ఊరికే రావు.. ఆ కోట్ల రెమ్యూనరేషన్‌లో సగం ట్యాక్సులకే వెళ్తాయి. అయినా ఆ కోట్ల రెమ్యూనరేషన్ ఏమీ ఊరికే ఇవ్వరు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. బాహబలిలో ప్రభాస్ కండలు పెంచితే ఇచ్చారు.. రానా అలా కండలు పెంచితేనే బాహబలి అయింది.. రెమ్యూనరేషన్‌లు ఇస్తారు.
ఎన్టీఆర్‌లా అద్భుతమైన డ్యాన్సులు వేస్తేనే ఇస్తారు.. రామ్ చరణ్‌లా అద్భుతంగా గుర్రపు స్వారీలు చేస్తేనే ఇస్తారు అంటూ ఇండస్ట్రీలోని హీరోల గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఎక్కడెక్కడి నుంచో వచ్చిన హీరోయిన్లు.. అందరి ముందు సిగ్గు విడిచి అందరూ చూస్తుండగా నటిస్తే వారికి రెమ్యూనరేషన్‌లు ఇస్తారు..అది కూడా తప్పంటే ఎలా? మీలా తప్పుడు పనుల చేసి సంపాదించడం లేదు.. మా కష్టంతో సంపాదిస్తున్నామని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకులను ఏకిపారేశాడు.
