Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో అకీరా నందన్.. స్పెషల్ రోల్ కోసం కసరత్తులు?
Pawan Kalyan : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదేళ్ల పాటు ఒక్క సినిమా హిట్ కాకపోయినా టాప్ హీరోగానే పవన్ కల్యాణ్ ఉన్నారు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ ..2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ క్రమంలో ఇక సినిమాలు చేయబోనని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత కాలంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన పవన్.. ప్రజెంట్ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ఓ వైపు రాజకీయం మరో వైపు సినిమాలు చేస్తున్నారు.

pawan kalyan akira nandan entry to-tollywood
పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందని, ఇందుకు సంబంధించిన బాధ్యతలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తీసుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. పవన్ కల్యాణ్ మాదిరిగానే ఆయన తనయుడు అకీరా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు న్యూస్ చక్కర్లు కొట్టాయి. తాజాగా అకీరా సినీ ఎంట్రీపై మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ గురించి తెలిసిందే. కాగా, ఈ చిత్రం మొఘలుల సామ్రాజ్య కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతుండగా, పవన్ ఇందులో తన మార్షల్ ఆర్ట్స్, కర్రసామును మరోసారి చూపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం ద్వారా పవన్ తనయుడు అకీరా నందన్‌ను సిల్వర్ స్క్రీన్‌పైన మెరవబోతున్నాడట.
Pawan Kalyan : కర్రసాము నేర్చుకుంటున్న అకీరా..

pawan kalyan akira nandan entry to-tollywood
ఈ మూవీలో అకీరాకు స్పెషల్ రోల్‌ను క్రిష్ ఆఫర్ చేయగా, ఆ పాత్ర కోసం అకీరా కర్ర సాము నేర్చుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో అకీరా పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని, అందుకే పవన్ అకీరా రోల్‌కు ఓకే చెప్పారని వినికిడి. అలా పవన్ కల్యాణ్ తనయుడి సినీ ఎంట్రీని దగ్గరుండి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. చూడాలి మరి..ఈ వార్తలో ఎంత నిజముందో మరి..