Home » Entertainment » Pawan Kalyan Fan Moment Of Sai Dharam Tej
Entertainment

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అభిమానిగా మారిపోయిన సాయి ధ‌ర‌మ్ తేజ్.. థియేట‌ర్‌లో రచ్చ మాములుగా లేదుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 2, 2022, 9:30 pm
Advertisement

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయ‌న పేరు చెబితే ప్ర‌తి ఒక్కరు పుల‌కించిపోతారు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ప‌వ‌న్ పేరు చెబితే తెగ మురిసిపోతుంటారు. అప్పట్లో వచ్చిన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాను సగటు ప్రేక్షకుడు అస్సలు మరవలేడు. ఆ సమయంలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ సూపర్ డూపర్ హిట్ సాధించింది ఖుషీ మూవీ. నిర్మాతలకు లాభాల పంట పండించడమే గాక నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా రీమేక్ చేయాల్సి వస్తే ఏ హీరో అయితే బాగుంటుందనే కోణంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Advertisement

Pawan Kalyan : తేజ్ ఆనందం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాను ప్రస్తుతం మీలో ఎవరు రీమేక్ చేస్తే సెట్ అవుతారు అని సుమ ఇటీవ‌ల ఓ ఈవెంట్‌లో ప్రశ్నించగా.. సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అవుతూ ఓపెన్ అయ్యారు. ఆ రోల్ చేయగలిగిన హీరో వన్ అండ్ ఓన్లీ అనేశారు సాయి తేజ్. ఆ సత్తా ఆయనకు మాత్రమే ఉందని అన్నారు.ప‌వ‌న్ అంటే సాయి ధ‌ర‌మ్ తేజ్ కి విప‌రీత‌మైన అభిమానం ,ప్రేమ‌. త‌న‌కు యాక్సిడెంట్ అయిన‌ప్పుడు ప‌వ‌న్ ద‌గ్గ‌రుండి తేజ్ ఆరోగ్య ప‌రిస్థితుల గురించి వాక‌బు చేశాడు. అంతేకాదు వైద్యుల‌ని అప్ర‌మ‌త్తం చేస్తూ తేజూ త్వ‌ర‌గా కోలుకునేలా చేశాడు ప‌వ‌న్.

pawan kalyan fan moment of sai dharam tej

Advertisement

సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కావడంతో బుధ, గురువారాలలో పలు చోట్ల పవన్ సూపర్ హిట్ చిత్రాలైన తమ్ముడు, జల్సా సినిమాలను రీ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ షోస్ తో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ స్పెషల్ షోలకు గాను వచ్చే డబ్బుని ఏదొక ట్రస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది అని పవన్ అభిమాన సంఘాలు వెల్లడించాయి.ఈ క్రమంలో పవన్ అభిమానించే వారిలో నేను ముందు వరుసలో ఉంటా అనే చెప్పే సాయి ధరమ్ తేజ్ కూడా అభిమానులతో కలిసి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జల్సా స్పెషల్ షోని ఎంజాయ్ చేశారు. తోటి అభిమానులతో కలిసి తను కూడా పేపర్లు ఎగరవేస్తూ సందడి చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇది చూసినా పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి