Pawan kalyan : భీమ్లా నాయక్ పోస్ట్ పోన్..రాజమౌళిపై ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్..ట్వీట్స్‌ పెట్టిన మంట..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 22, 2021, 1:00 pm

Pawan kalyan : పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా పోస్ట్ పోన్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలను నిజం చేస్తూ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఫిబ్రవరి 25వ తేదీకి షిఫ్ట్ అయింది. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చివరి క్షణంలో వాయిదా వేయడం సరికాదంటూ సినీ టీమ్ పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పోస్ట్ పోన్‌ వెనుక దిల్ రాజు స్వార్థం ఉందని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్స్‌ మరో సరికొత్త వివాదానికి తెర లేపాయి.

pawan kalyan fans fires on rajamouli tweets over bheemla naik

pawan kalyan fans fires on rajamouli tweets over bheemla naik

భీమ్లా నాయక్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే.. రాజమౌళి చేసిన ట్వీట్స్ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయి. మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేసినందుకు నిర్మాత చినబాబు, పవన్ కళ్యాణ్‌ అభినందనీయులు అంటూ రాజమౌళి చేసిన కామెంట్ పై పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనపై విరుచుకు పడ్డారు. ఆర్ ఆర్ ఆర్ కోసం.. సంక్రాంతి బరి నుంచి ఆఖరి నిమిషంలో భీమ్లా నాయక్‌ ను తప్పించారని ఆరోపిస్తూ రాజమౌళి పై మండి పడుతున్నారు.ఇదిలా ఉండగా.. రాజమౌళి మరో ట్వీట్ కూడా చేశారు. నా హీరో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ను ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా రిలీజ్ చేయవద్దని నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ జక్కన్న చేసిన ట్వీట్‌ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

Pawan kalyan ఆర్ ఆర్ ఆర్ వల్లే.. పోస్ట్ పోన్..!

అంతటితో ఆగక.. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న F3 సినిమా రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరి 25 నుంచి ఎప్రిల్ 29వ తేదీకి మార్చడంపై కూడా రాజమౌళి థ్యాంక్స్ చెప్పారు. ఇదంతా గమనిస్తున్న సినీ అభిమానులు.. మీ ఒక్క సినిమా కోసం మా అభిమాన హీరోల మూవీలను మీరే దగ్గరుండి పోస్ట్ పోన్ చేయిస్తున్నారా అని ఆయనను నిలదీస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ రచ్చ చూస్తూ ఉంటే.. ఇప్పుడీ వివాదం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.

Breaking News 2

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp