Niharika Konidela : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాలి తీసేసిన నిహారిక.. అలా అనేసింది ఏంటి ?
Niharika Konidela : రోజు రోజుకి మెగా అల్లు వివాదం రచ్చగా మారుతున్న విషయం తెలిసిందే. ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. అయితే నిహారిక చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. నిహారిక నిర్మాతగా ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమా చేసింది. ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో దాదాపు అందరూ కొత్త ఆర్టిస్టులే. వీరిందరితో ఓ మంచి సినిమాను నిర్మించింది మెగా డాటర్. ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీల అభినందించారు. అయితే తాజాగా జరిగిన సక్సెస్ సెలబ్రేషన్‌లో నిహారికకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెకి నెగెటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు.
‘కమిటీ కుర్రోళ్లు’కి సంబంధించిన ఓ ఈవెంట్‌లో నిహారిక మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో నిహారిక కాసేపు సైలెంట్‌గా ఉండి తర్వాత ఊహించని పంచ్ వేసింది. “అవునమ్మా మీ ఫ్యాన్స్ చెప్పింది కరెక్టే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు.. మా బాబాయ్ డిప్యూటీ సీఎం” అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ దెబ్బతో అప్పటివరకూ అరిచిన ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. దీంతో నిహారిక కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి.
Niharika Konidela : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాలి తీసేసిన నిహారిక.. అలా అనేసింది ఏంటి ?
ఇక ఇదిలా ఉంటే ఇటీవల అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీతో వైరానికి దిగారు. .. ‘మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు. దీంతో మరోసారి మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది . సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల అభిమానులు యుద్దానికి దిగుతున్నారు.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.