
Nagarjuna : ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేయడం వలన నాగార్జునిక అన్ని కోట్ల నష్టమా ?
Nagarjuna : ప్రముఖ నటుడు, కింగ్ నాగార్జున వివాదాలకి చాలా దూరంగా ఉంటారు. ఆయన బాగానే ఆస్తులు కూడాపెట్టిన కూడా ఎక్కడ గర్వం ఉండదు. ఇండియాలోనే అత్యంత ధనిక నటుల్లో నాగార్జున ఒకరు. సినిమా రంగంతో పాటు అనేక వ్యాపారాలు నాగార్జునకి ఉన్నాయి. అయితే నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. నాగార్జున ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని అందుకే ఆ నిర్మాణాన్ని కూల్చివేశామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ 400 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జునకు ఏడాదికి దాదాపుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఆదాయం వస్తోందని సమాచారం.
ఈ ఫంక్షన్ హాల్ ని ఉపయోగించుకోవడానికి కోట్లల్లో ఖర్చు అవుతుందట. ఈ ఫంక్షన్ హాల్ నుంచి ప్రతి ఏడాది నాగార్జునకి 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని టాక్. కూల్చివేత వల్ల వందల కోట్లల్లో నష్టం వాటిల్లిందని అంటున్నారు. నాగార్జున ప్రస్తుతం హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కూల్చివేత చట్ట విరుద్ధం అని అన్నారు. మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కోర్టులో ఎలా పోరాడతారు.. నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. తుమ్మిడి కుంట చెరువులో కొన్ని ఎకరాలని అక్రమంగా ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ.హైడ్రా అధికారులు దీనికి సంబంధించిన ఆధారాలతో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు.
Nagarjuna : ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేయడం వలన నాగార్జునిక అన్ని కోట్ల నష్టమా ?
నాగార్జున ఈ ఘటన విషయంలో ఒకింత సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.మరోవైపు నాగార్జునను బిగ్ బాస్ షో నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తుండటంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పదేపదే నాగర్జునను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నాగార్జునకు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే సమయం అయినా ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల నాగార్జున సినిమాలతోను పెద్దగా అలరించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం ఆయనకి బ్యాడ్ టైం నడుస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.