
Pawan Kalyan Janavani, What Will Happen?
Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ మళ్లీ తన రాజకీయ క్షేత్రంలోకి అడుగు పెట్టారు. ఆదివారం విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక రోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా దీక్ష అనంతరం పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ దీక్షలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలుసుకుని జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు మంగళగిరికి తరలివచ్చారు.ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా విమర్శించారు. జనసేన అధికారంలోకి వస్తే వైసీపీ చేత తప్పులకు సమాధానం చెప్పిస్తామని అన్నారు పవన్.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పోరాడటం లేదని ఈ సందర్భంగా పవన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపై సంచలన కామెంట్స్ చేశారు. తన సినిమాల ప్రదర్శన నిలిపేసి తన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. తన సినిమాలను ఆపేసి దెబ్బ కొట్టాలని చూశారని, ఒక వేళ అటువంటి పరిస్థితులే ఏర్పడితే తన సినిమాలు ఉచితంగా ఆడిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. తమ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే ప్రజల తరఫున నిలబడతామని, 2024లో వచ్చేది తమ ప్రభుత్వమేనని జనసేనాని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ మాటలతో జనసేన నేతలు, కార్యకర్తల్లో జోష్ వచ్చింది. జనసేనాని చాలా కాలం తర్వాత మళ్లీ రాజకీయ క్షేత్రంలోకి దిగి ప్రజల తరఫున మట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
pawan kalyan fire on ap govt
ఈ ఒక్కరోజు దీక్ష ద్వారా పవన్ మళ్లీ ఏపీ పాలిటిక్స్‌లో సెంటర్ పాయింట్ అయ్యారని విశ్లేషిస్తున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశారు. ఈ పిక్చర్.. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.