Pawan Kalyan : పూరి జగన్నాథ్‌కి గ్రీన్ సిగ్నల్.. హ్యాట్రిక్ హిట్ కోసం పవన్‌ను ఎలా చూపించబోతున్నారో తెలుసా..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? ప్రస్తుతం అవుననే మాట ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన సినిమాలు 4 ఉన్నాయి. వాటిలో ఓ ప్రాజెక్ట్‌కు పవన్ కళ్యాణ్ దర్శకుడిగా పూరిని ఎంచుకున్నారట. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రెండు సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ సగానికి పైగా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను, ధర్మ ప్రొడక్షన్స్ – పూరి కనెక్ట్స్ కలిసి పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండతోనే తన డ్రీమ్మ్ ప్రాజెక్ట్ జనగణమనను ఇటీవలే మొదలుపెట్టారు పూరి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, దర్శకుడు వంశీపైడిపల్లి కలిసి భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. లైగర్ ఈ ఆగస్టులో 25వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇక జనగణమన వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పూరికి మూడవ సినిమా కోసం ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. పూరిని దర్శకుడిగా పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. బద్రి పూరికి మొదటి సినిమా.అప్పటికే పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్. అయినా పూరి టాలెంట్ చూసి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ.

Pawan Kalyan Green signal to Puri Jagannadh

Pawan Kalyan : పవన్‌కు ఇప్పుడు కావాల్సింది పూరి లాంటి దర్శకుడు..ఇలాంటి కథే.

దీని తర్వాత పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాథ్ కలిసి కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాను చేసి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం మళ్ళీ కలవబోతున్నారట. వాస్తవంగా ఈ కాంబోకోసం ఎప్పటి నుంచే పీకే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. ఇక ఈ సినిమాను కేవలం మూడు నెలల్లో కంప్లీట్ చేసేలా పవన్ పూరికి సూచించారట. పూరికి పవన్ దొరకాలేగానీ, నిజంగా మూడు నెలల్లో సినిమా రిలీజ్ కూడా చేస్తారు. కాగా, ఇక్కడ హైలెట్ విషయం ఏమిటంటే పూరి హ్యాట్రిక్ సినిమాలో పవన్‌ను సీఎం గా చూపించబోతున్నారట. కంప్లీట్ పొల్టికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే, పవన్‌కు ఇప్పుడు కావాల్సింది పూరి లాంటి దర్శకుడు..ఇలాంటి కథే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

1 month ago