Pawan Kalyan : పవన్ సినిమా అప్పుడు అయ్యిందన్నారు ఇప్పుడు కాలేదు అంటున్నారు.. అసలేం జరుగుతోంది?

 Authored By aruna | The Telugu News | Updated on :2 September 2022,2:00 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం ఆయన అభిమానులకు కాస్త చిరాకును తెప్పిస్తోంది. ఒకవైపు రాజకీయాలు చేస్తూ మరో వైపు సినిమాలను చేస్తానంటూ ఆ మధ్య ప్రకటించి వరుసగా నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పిన పవన్ ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవ్వడంతో సినిమాలు మొదలు పెట్టిన నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు. ఏదోలా భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ అదే సమయంలో ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమాను మాత్రం పూర్తి చేయలేకపోతున్నాడు.

ఆయన దాదాపు సంవత్సర కాలంగా అదిగో ఇదిగో అంటూ డేట్లు ఇవ్వకుండా నిర్మాతను మరియు దర్శకుని వెయిటింగ్ లో పెట్టాడు. మళ్లీ ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది అంటూ సమాచారం అందుతుంది. ఆ మధ్య నిర్మాత రత్నం మాట్లాడుతూ సినిమా షూటింగ్ దాదాపుగా 60 శాతం పూర్తి అయిందని త్వరలోనే షూటింగ్ ని పున ప్రారంభించి నెల రోజుల్లోనే పూర్తి చేస్తామంటూ పేర్కొన్నాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.

pawan kalyan hari hara veeramallu movie shooting update

pawan kalyan hari hara veeramallu movie shooting update

ఇప్పటి వరకు 30% వరకే షూటింగ్ పూర్తి అయిందని దర్శకుడు క్రిష్ సన్నిహితుల వద్ద చెప్పాడట, సినిమాకు దాదాపుగా రెండు నెలల డేట్లు కావాలని పవన్ ని ఇప్పటికే దర్శకుడు అడిగాడని అందుకు పవన్ కళ్యాణ్ ఓకే అన్నాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా జుట్టు పీక్కుంటున్నారు. హరిహర వీరమల్లు మాత్రమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా పవన్ కళ్యాణ్ మొదలు పెట్టి మధ్యలో ఉంచాడు. ఆ ప్రాజెక్టుల సంగతి ఏంటో మరి చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి