Home » Entertainment » Pawan Kalyan Is Going To Produce Varun Tej Movie
Entertainment

వరుణ్ తేజ్ తో సినిమా నిర్మించబోతున్న పవన్ కళ్యాణ్ ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: January 11, 2021, 9:38 am
Advertisement

వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ అన్న సినిమాతో పాటు సక్సస్ ఫుల్ సినిమా ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. బాక్సర్ కోసం వరుణ్ తేజ్ ఎంతో శ్రమిస్తున్నాడు. ఒక బాక్సర్ గా ఎలాంటి ఫిజిక్ కలిగి ఉండాలో అలా తయారై సినిమా కోసం కొత్తగా మోకోవర్ అయ్యాడు. ముందు నుంచి సినిమాల ఎంపికలో వరుణ్ తేజ్ శైలి చాలా భిన్నంగా ఉంటోంది. కమర్షియల్ అంశాలు .. మాస్ ఆడియన్స్ కి కావలిసిన అంశాలు ఉంటూనే దమ్మున్న కథలను ఎన్నుకుంటున్నాడు.

Advertisement

అందుకే వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఎక్కువగా సూపర్ హిట్సే ఉన్నాయి. ఇక కంచె, అంతరిక్షం లాంటి ప్రయోగాత్మ సినిమాలు చేయడానికి వరుణ్ తేజ్ ఆసక్తి చూపిస్తున్నాడు. యంగ్ హీరోలలో ఇంత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్న హీరో ఒక్క వరుణ్ తేజ్ మాత్రమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫిదా, తొలిప్రేమ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ చేసినా.. ఎఫ్ 2 లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేసినా వరుణ్ తేజ్ తన సత్తా చాటుతున్నాడు.

Advertisement

కాగా మెగా అభిమానులు ఎగిరి గంతేసి పండుగ చేసుకునే న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ లో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా నిర్మాణం కాబోతోందని లేటెస్ట్ అప్‌డేట్. ఈ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ వినిపించినట్టు ఆ కథ పవన్ కళ్యాణ్ కి నచ్చడం తో వరుణ్ తేజ్ తో సినిమా చేయాలని డిసైడయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో రానందని సమాచారం.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి