Home » Entertainment » Pawan Kalyan Is Trivikram Biggest Fight
Entertainment

BREAKING : పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి అతిపెద్ద గొడవ ?

Authored By
Breaking News
The Telugu News | Updated on: February 4, 2023 6:25 pm
Advertisement

BREAKING : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహా “అన్ స్టాపబుల్” పార్ట్ వన్ ఎపిసోడ్ తిరుగులేని రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ షోలో బాలయ్య మరియు పవన్ ఫుల్ జోష్ మీద కనిపించారు. ఫస్ట్ టైం ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో దాదాపు గంటన్నరకు పైగా కొత్త విషయాలు గురించి మాట్లాడుకోవడం తో మెగా మరియు నందమూరి అభిమానులు ఈ షో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హోస్ట్ గా బాలకృష్ణ మరింతగా పవన్ కళ్యాణ్ ని నవ్వించారు. ఇదే సమయంలో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు ఇంకా వ్యక్తిగత విషయాలు గురించి కూడా ప్రశ్నలు వేయడం జరిగింది.

Advertisement

pawan kalyan is trivikram biggest fight

దీనిలో భాగంగా డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. త్రివిక్రమ్ మీరు బాగా ఫ్రెండ్స్ అంటగా అని బాలయ్య ప్రశ్నించగా అవ్వాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు స్నేహితుడిగా కంటే త్రివిక్రమ్ తన గురువుగా భావిస్తానని పవన్ చెప్పడంతో బాలయ్య ఆశ్చర్యపోయారు. ఓ రచయితని గురువుగా భావించావంటే నీ మీద ఉన్న గౌరవం నాకు ఇంకా మరింతగా పెరిగింది అని ప్రశంసించారు. ఇక ఇదే సమయంలో త్రివిక్రమ్ తాను ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడుకుంటామని

Advertisement

pawan kalyan is trivikram biggest fight

స్పష్టం చేశారు. అయితే త్రివిక్రమ్ కి నాకు ఓ విషయంలో పెద్ద గొడవ ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. అదేమిటంటే అతడు సినిమా స్క్రిప్ట్ చెబుతున్న సమయంలో తాను నిదరపోయినట్లు.. త్రివిక్రమ్ చెబుతాడు. కానీ తాను నిద్రపోలేదు సినిమా స్క్రిప్ట్ మొత్తం విన్నాను అని.. చెబుతాను. లేదు లేదు నువ్వు నిద్రపోయావు అని త్రివిక్రమ్ నాతో ఇప్పటికీ కూడా గొడవ పడుతూ ఉంటాడు. ఈ సందర్భం గురుంచి ఇప్పటకీ ఎవరికివారు వాదించుకుంటూ ఉంటాం.. అని త్రివిక్రమ్ తో తనకున్న స్పెషల్ బాండింగ్ గురించి “అన్ స్టాపబుల్” షోలో పవన్ తెలియజేశారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి