Comedian Ali : బుద్ది లేని ఆలీ ఉన్న అవకాశాలను కూడా పోగొట్టుకున్నాడు.. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఇంతే
Comedian Ali : తెలుగు వెండి తెరపై సుదీర్ఘ కాలంగా కమెడియన్ వేషాలు వేస్తూ హీరోగా పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించిన ఆలీ గత కొంత కాలంగా రాజకీయాలతో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు సినిమాల్లో ఉన్న క్రేజ్ తో రాజకీయాల్లో వెలుగు వెలిగి పోవడం ఖాయమని ఆయనకు ఆయనే భావించాడు. కానీ రాజకీయాల్లో ఆయనకు అంత సీన్ లేదని ఇప్పటికే అర్థమైంది. వైకాపా లో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆలీకి పెద్దగా వైకాపా నుండి మద్దతు లభించలేదు. అలీ కి గుర్తింపు లేని పదవి ఇచ్చి ఆయనకు ఏదో పెద్ద ఆఫర్ చేసినట్టుగా వైకాపా వారు మాట్లాడుకుంటున్నారట.
ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాను పోటీకి సిద్ధం అన్నట్లుగా ఆలీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. పవన్ కళ్యాణ్ తో పోటీ పడే స్థాయి నీది కాదు అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆలీ రాజకీయం సినీ కెరీర్ పై పై పెద్ద దెబ్బ పడేలా చేసింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో తో ఆలీ విభేదాలు పెట్టుకోవడం వల్ల కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది అని అంతా భావించారు.
అనుకున్నట్లుగానే గత ఏడాది కాలంగా ఆలీ నటిస్తాను బాబోయ్ అంటూ నిర్మాతలు వెంట పడుతున్న కూడా ఏ ఒక్క నిర్మాత కూడా మంచి పాత్రను ఆఫర్ చేయడం లేదట. ఒకటి రెండు సంవత్సరాల్లో ఆలీని సినీ ప్రేక్షకులు పూర్తిగా మరిచి పోతారేమో అనే ప్రచారం కూడా జరుగుతుంది. హాయిగా సినిమాలు చేసుకుంటూ ఆలీ కెరీర్ లో ముందుకు సాగితే బాగుండేది కదా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆలీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఏంటీ.. ఆలీ సమాజ సేవ చేయాలని ఉత్సాహంతో వచ్చాడు. ఆయన్ను గౌరవించాలి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.