Taraka Ratna : తారకరత్న ఎప్పటినుంచో అడుగుతున్న కోరిక ని బాలయ్య ఇప్పటికైనా తీరుస్తాడా ?
Taraka Ratna : ప్రస్తుతం ఎక్కడ చూసినా నందమూరి తారకరత్న గురించి వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే ఇటీవల నారా లోకేష్ మద్దతుగా యువ గళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర స్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తారకరత్న గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య నందమూరి వంశానికి పెద్దదిక్కు అని చెప్పవచ్చు. వాళ్ళ కుటుంబీకులు కూడా బాలకృష్ణను ఎంతో గౌరవిస్తారు. ఈ తరం హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్,
తారకరత్న సైతం బాలకృష్ణ అంటే ఎంతో అభిమానాన్ని చూపుతారు. స్టార్ హీరోలైనప్పటికీ ఒక్కసారైనా తమ బాబాయ్ తో కలిసి నటించాలి అని ఆశ పడుతూ ఉంటారు. కళ్యాణ్ రామ్ తన బాబాయ్ తో కలిసి బాలగోపాలుడు సినిమాలో నటించాడు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో బాబాయ్ తో కలిసి ఒక సినిమాలో అయినా నటించాలి అని ఉంది అంటూ చెప్పారు. ఇదిలా ఉంటే ఇక తారకరత్న మొదటి నుండి బాలయ్య సినిమాలో కనిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం లో ఆయన తరఫున ప్రచారం కూడా నిర్వహించాడు తారకరత్న.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న తన బాబాయ్ బాలకృష్ణ తో కలిసి నటించాలని ఉంది అనే అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే విలన్ పాత్రలో కాదు కీలక పాత్రలో నటిస్తున్నాడు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా తారకరత్న ఎప్పటినుంచో బాలకృష్ణతో కలిసి నటించాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుందని నందమూరి అభిమానులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.