Home » Entertainment » Pawan Kalyan Mother Anjana Devi Has Said Something Unbelievable About Her Health
Entertainment

Pawan Kalyan : తన కొడుకు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి నమ్మలేని విషయం చెప్పిన తల్లి అంజనా దేవి !

Authored By
Breaking News
The Telugu News | Published on: May 15, 2023, 4:30 pm
Advertisement

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా సినిమా పరంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా పరంగా వరుస పెట్టి ఏకంగా నాలుగు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నెల నుండి పూర్తిగా రాజకీయాలకు టైమ్ ఎక్కువగా కేటాయించడం జరుగుతుందని ఇటీవల పర్యటనలో స్పష్టం చేయడం జరిగింది. ఒకపక్క ఎండలు భయంకరంగా ఉంటున్నా గానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తగ్గకుండా రైతుల బాధలను తెలుసుకోవడానికి ఇటీవల తూర్పుగోదావరిలో పర్యటించారు.

Advertisement

Pawan Kalyan mother Anjana Devi has said something unbelievable about her health

ఇదిలా ఉంటే మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిన్న కొడుకు ఎండనక వాననక తిరుగుతూ ఉంటాడు. అసలు ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోడు. కానీ పవన్ కళ్యాణ్ కి చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకునే దాన్ని అని తెలిపారు. ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి సహాయం చేయమని భగవంతుడు వాడికి పని పెట్టాడు. ఏదోరోజు కచ్చితంగా వాడు విజయం సాధిస్తాడు

Advertisement

అన్న నమ్మకం నాకుంది అని అంజనాదేవి చెప్పుకొచ్చారు. ఇక పెద్ద కొడుకు చిరంజీవి మొదటి నుంచి సాయం చేసే గుణం ఉంది. చిన్నప్పుడే స్నేహితులకి సహాయం చేసేవాడు. ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు. అప్పుడు ఎలా ఉన్నాడో మెగాస్టార్ అయ్యాక కూడా అలానే ఉన్నాడు తేడా ఏమీ లేదని అన్నారు. సురేఖ నాకు కోడలు కాదు కూతురు లాంటిదని అనవచ్చు. నాకు చిన్న జలుబు వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటది. ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉంటది అని అంజనాదేవి ఇంటర్వ్యూలో… కుటుంబ సభ్యుల గురించి కీలక విషయాలు తెలియజేశారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి