Home » Entertainment » Jabardasth Rohini Was Admitted To The Hospital
Entertainment

Jabardasth Rohini : జబర్దస్త్ రోహిణి ఎందుకు ఆసుపత్రి లో చేరింది? ఏమైందో తెలిస్తే మీరు తట్టుకోలేరు !

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 15, 2023 1:55 pm
Advertisement

Jabardasth Rohini : జబర్దస్త్ రోహిణి అందరికీ సుపరిచితురాలే. టెలివిజన్ రంగంలో కొన్ని సీరియల్స్ లో కూడా కనిపించడం జరిగింది. ఇటీవల సూపర్ డూపర్ హిట్ అయిన బలగం, సేవ్ ది టైగర్స్ అనే సినిమాలో కూడా నటించింది. అదిరిపోయే తన టైమింగ్ పంచ్ డైలాగులతో.. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అల్లరిస్తూ ఉంటది. కాగా తాజాగా రోహిణి హాస్పిటల్ లో జాయిన్ అయింది. ఆమెకు సర్జరీ చేయాల్సి ఉంటే వైద్యులు కుదరదని చెప్పటమే కాదు సాధ్యం కాదని… తేల్చేశారు.

Advertisement

దీంతో రోహిణి ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పనుల పేరుతో.. వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత నష్టం అనే విషయం అర్థం కావడం ఖాయం. ఇంతకీ రోహిణి చేయించుకోవాల్సిన సర్జరీ విషయానికొస్తే ఐదు సంవత్సరాల క్రితం ఆమె ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కాలులో రాడ్ వేశారు. దాన్ని తీయించాలని అనుకుంటున్నా… వరుస షూటింగ్స్ కారణంగా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు టైం దొరికి వైద్యుల వద్దకు వెళ్లి కాలులో ఉన్న రాడ్…

Advertisement

Jabardasth Rohini was admitted to the hospital

తీసి ప్రశాంతంగా ఉందామని రోహిణి అనుకుంది. కానీ రాడ్ బయటకు తీయించుకోవాల్సిన టైం లో.. నిర్లక్ష్యం చేయడంతో అది చర్మానికి అతుక్కుపోయిందట. ఒకవేళ ఫోర్సు పెట్టి తీస్తే…. మరింత ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. రాడ్డు తొలగించలేదు గాని కాలుకి మైనర్ సర్జరీ చేశారు. దీంతో మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఆరోగ్యం విషయంలో వైద్యుల వద్దకు వెళ్లాల్సిన టైం లో సమయానికి వెళ్ళండి అని రోహిణి తాజా వీడియో ద్వారా సందేశాన్ని తెలియజేయడం జరిగింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి