Pawan Kalyan OG Movie : ఓజీ షూటింగ్.. బెల్ బాటమ్ ప్యాంట్‌లో పవన్ కళ్యాణ్ అదుర్స్.. వీడియో వైరల్..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan OG Movie : ఓజీ షూటింగ్.. బెల్ బాటమ్ ప్యాంట్‌లో పవన్ కళ్యాణ్ అదుర్స్.. వీడియో వైరల్..!
Pawan Kalyan OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైన సంగతి తెలిసిందే. 2023లో ‘బ్రో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు పొలిటికల్ జర్నీలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఆయన మూవీ లైనప్ లోని సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి.

Pawan Kalyan OG Movie : ఓజీ షూటింగ్.. బెల్ బాటమ్ ప్యాంట్‌లో పవన్ కళ్యాణ్ అదుర్స్.. వీడియో వైరల్..!
Pawan Kalyan OG Movie లుక్ అదుర్స్..
హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఓజీతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహింస్తుండగా ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్ లో జరిగింది. తాజాగా ముంబైలో పవన్ షూటింగ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
వీడియోలో పవన్ బెల్ బాటమ్ ప్యాంట్ ధరించి సెక్యూరిటీ నడుమ కారు ఎక్కేందుకు వెళుతున్నాడు. పవన్ ని ఇలా చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఓజీ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 25 సెప్టెంబర్ 2025న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే విజయదశమిని దృష్టిలో ఉంచుకొని సినిమా విడుదల తేదీని లాక్ చేసినట్టు తెలుస్తోంది.
