Pawan Kalyan : పెళ్లి పత్రికపై పవర్‌స్టార్ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్..
Pawan Kalyan : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పాలిటిక్స్ కు, మూవీస్ కు సంబంధం లేకుండా ఆయన వ్యక్తిత్వానికే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన పేరు వింటే ఫ్యాన్‌కు పూనకాలే. అందుకే ఇండస్ట్రీలో అయినా, పాలిటిక్స్‌లో అయిన పవన్ ప్రత్యేకం. ఆయనపై అభిమానం చాటుకునేందుకు ఆయన ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు తాపత్రయ పడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇక ఆయన మూవీ రిలీజ్ అయిందంటే ఫ్యాన్స్ కు అదొక జాతరే.. హిట్ కు, ఫ్లాప్ కు సంబంధం లేకుండా తేడా చూపించకుండా ఉంటారు ఆయన ఫ్యాన్స్.
Pawan Kalyan : ఫ్యాన్స్ డిఫరెంట్ ఆలోచన

pawan kalyan photo on fan wedding card
అయితే ఇటీవలే ఒక ఫ్యాన్స్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పవన్ పై అభిమానాన్ని చాటుకునేందుకు ఓ అభిమాని వెడ్డింగ్ ఇన్విటేషన్ పై దేవుడి ఫొటో ఉండాల్సిన ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కు పెద్ద ఫ్యాన్. ఈ నెల 18న ఆయన మ్యారేజ్ ఫిక్స్ అయింది. దీంతో అతని వెడ్డింగ్ కార్డుపై పవన్ ఫొటోను ముద్రించుకున్నారు. తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలంటూ జనసేనానికి ఆహ్వానం సైతం పంపించాడు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
పవన్ బర్త్ డే సందర్భంగా కడపకు చెందిన ఓ బీటెక్ స్టూడెంట్ ఆయనకు డిఫరెంట్ విషెస్ చెప్పాడు. 50 రూబీ క్యూబ్‌లతో పవన్ నవ్వుతున్న రూపాన్ని దిద్దాడు. ఇందుకోసం అతడు సుమారు రెండు రోజుల పాటు కష్టపడినట్టు తెలిపాడు. ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని డిఫరెంట్ గా తెలుపుతూనే ఉన్నారు.