Pawan Kalyan : ఈ కాంబో సినిమా గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్..ఎందుకంటే..?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చిన దర్శకుడి నుంచి రాజమౌళి వంటి పాన్ ఇండియా స్టేటస్ సాధించిన దర్శకుల వరకు ప్రతీ ఒక్కరూ ఆశపడుతుంటారు..కోరుకుంటారు. కానీ, ఈ కాంబోలో సినిమా గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అంటున్నారు నెటిజన్స్. దీనికి కారణాలు కూడా బలంగానే ఉన్నాయి. ముఖ్యంగా రాజమౌళి ఒక హీరోతో సినిమా మొదలు పెడితే ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్పడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే ఆయన జక్కన్న. ప్రతీ షాట్‌ను తనకు నచ్చినట్టు వచ్చేదాకా చెక్కుతూనే ఉంటారు.
ఇప్పుడు రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడు నుంచి నాలుగేళ్ళు ఖర్చు చేయాల్సిందే. అది టాలీవుడ్‌లో ఏ హీరోకైనా కుదురుతుందేమోగానీ, మన పవర్ స్టార్‌కు మాత్రం అస్సలు కుదరదు. ఎందుకంటే ఆయనకు సీమాలొక్కటే లోకం కాదు. జనాలు, పార్టీ కూడా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే అదే
ప్రధానం. అందుకే, ఆయన కమిటైన సినిమాలకు డేట్స్ ఇచ్చి కూడా ప్రజలకు ఇబ్బందులొచ్చాయంటే నిర్మొహమాటంగా షూటింగ్ మధ్యలోనుంచైనా వెళ్ళిపోతారు. సినిమా కంటే ముందు రాజకీయం, జనాల శ్రేయస్సు కోరుకుంటున్నారు పవన్.ఆయన ప్రస్తుతం ఏ సినిమాకైనా 40 నుంచి 50 రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వగలుగుతున్నారు.

Pawan Kalyan Rajamouli Talking about combo movie is waste of time
Pawan Kalyan : పవన్‌కు రాజమౌళి వంటి గొప్ప దర్శకులతో సినిమా చేయాలని ఉంటుంది.
ఆయన పార్ట్‌ను 30 రోజుల్లో కంప్లీట్ చేసేద్ధాం అని దర్శకుడు చెపితే ముందు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తెచ్చేయమని చెప్పేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ కనీసం రెండేళ్ళు లాకయ్యే దర్శక ధీరుడి
సినిమాకు డేట్స్ ఇవ్వడం..ఆయనతో సినిమా చేయడం అంటే ఎంత మాత్రం అయ్యే పనికాదు. పవన్‌కు రాజమౌళి వంటి గొప్ప దర్శకులతో సినిమా చేయాలని ఉంటుంది. ఆయనకు దర్శకులు ముఖ్యం. కానీ, ఇక్కడ టైమ్ ఫ్యాక్టర్ ఇద్దరి మధ్య అడ్డుగోడగా నిలిచింది. అది తొలగడం బహుషా అయ్యే పని
కాదేమో. ఈ అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉంది. అలాగే, ఇద్దరు కలిసి ఒక్క సినిమా చేయాలనీ ఆరాటం ఉంది. కానీ..కొన్ని మాట్లాడుకోవడానికే.