పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం సినిమా లో ఇన్నాళ్ళు ఉన్న సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. పవన్ మూవీలో రానా నటిస్తున్నట్లు..లేటెస్ట్ అప్‌డేట్స్ వచ్చింది. మలయాళంలో బంపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో హీరోల లిస్ట్ ఫైనల్ అయ్యింది. మొదట్లో ఈ రీమేక్ మూవీలో నటిస్తున్నారని చాలా మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. బాలకృష్ణ, రవితేజ ఇలా చాలా మంది స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా అందరిని ఆశ్చర్యపరిచే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీలో మెయిన్ లీడింగ్ పాత్రలో నటిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.
మలయాళంలో 2020 లో అత్యధిక ప్రేక్షకాధరణ పొంది బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన మూవీ కావడంతో ఈ సినిమా చేసేందుకు పవన్ అంగీకరించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే రానా రెండో హీరోగా నటిస్తారని ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. కానీ అప్పటికీ క్యారెక్ట్‌ర్ కి రానా ఫిక్స్ కాలేదని, ఈ మూవీలో పవన్ డామినేటింగ్ ఉంటారని.. అందుకు తాను చేసేందుకు నిరాకరించారని గాసిప్స్ వచ్చాయి. వాటన్నింటిని బ్రేక్ చేస్తూ లేటెస్ట్ గా మూవీకి ఓకే చెప్పినట్లు అధికారికంగా వెల్లడైంది. దీంతో మూవీలో నటించబోయే ఇతర ఆర్టిస్టులను దర్శక, నిర్మాతలు త్వరతగతిన సెలక్ట్ చేసే ప్రాసెస్ లో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే చాలా మందిని ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పారు. ఈ మూవీ ఇంత సక్సెస్ కావడానికి అందులోని రెండు పాత్రలని ఖచ్చితంగా చెప్పాలి. అయ్యప్పన్ నాయర్, పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌లు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ నాయర్ పాత్రలో ఓ నిజాయితీగల పవర్ ఫుల్ పోలీస్ ఆపీసర్ గా నటించనున్నారు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా కనిపించనున్నారు. కాగా రానా తండ్రిగా తమిళ నటుడు సముద్ర ఖని నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కూడా ఈ మూవీకే ఎంతో ప్లస్ పాయింట్ గా నిలిచింది.
ఇప్పటికే సముద్రఖని టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల వైకుంఠపురంలో నటించి ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో లేటెస్టుగా రానున్న పవన్ – రానా ల మల్టీస్టారర్ లో నటించే అవకాశాన్ని అందుకున్నారని, త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు దీంతో ఈ సినిమాపై మంచి హైప్ వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని సితారా ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవగా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారు.
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
This website uses cookies.