pawan kalyan bheemla nayak poster viral in social media
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వింటే చాలు..ఆయన ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో వచ్చి కొన్నాళ్ల పాటు సినీ అజ్ఞాతవాసంలో ఉన్న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు.మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ టైటిల్‌తో వస్తున్నఈ చిత్రంలో నెగెటివ్ రోల్ దగ్గుబాటి రానా ప్లే చేస్తున్నారు.
pawan kalyan rana photo trending in social media
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా సెట్‌లో ఆఫ్ కెమెరాలో పవన్ కల్యాణ్, రానా దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. సదరు ఫొటోలో పవన్ కల్యాణ్ పట్టె మంచంపై పడుకుని ఉండగా, రానా ఎడ్ల బండి నొగలపై ఒరిగాడు. షూటింగ్‌లో భాగంగా సీన్లు చేసి అలసిపోయిన క్రమంలో వాళ్లు ఇలా రెస్ట్ తీసుకుంటున్నట్లు ఫొటోను చూస్తే అర్థమవుతున్నది. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ బ్లూ కలర్ షర్ట్, బూడిద రంగు లుంగీ ధరించి ఉండగా, పవన్ కల్యాణ్ షర్ట్‌పైన రక్తపు మరకలు కనబడుతున్నాయి.ఇక రానా వైట్ అండ్ వైట్‌లో మెరిసిపోతున్నారు. తెలుపు రంగు చొక్కా, లుంగీలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా గెటప్‌లో ఉన్నట్లు కనబడుతున్నాడు.
Pawan kalyan Bheemla Nayak Title Song Released
సాగర్ .కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన కిన్నెర మెట్ల మొగులయ్య పాడిన ‘భీమ్లానాయక్ టైటిల్ సాంగ్’, చిత్ర పాడిన ‘అంత ఇష్టం ఏందయ్యా’ సాంగ్, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘భీమ్లానాయక్’ గా పవన్ కనిపించనుండగా, ఆయనకు జోడీగా నిత్యామీనన్, ‘డానియల్ శేఖర్’ పాత్ర పోషిస్తున్న రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
This website uses cookies.