
vadinamma 21 october 2021 full episode
Vadinamma 21 Oct Today Episode : బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ‘వదినమ్మ’ సీరయల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. భరత్ అసలు పాస్ అవుతాడో లేడో అని అనుకున్న క్రమంలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చి అందరి అభినందనలు పొందుతాడు. అలా భరత్ చదువు పట్ల శ్రద్ధ వహించి మంచి మార్కులు సంపాదించినందుకుగాను, భరత్‌ను ఇక షాపునకు వెళ్లొద్దని సీత అంటుంది. తన చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకోవాలని భరత్‌కు చెప్తుంది. అయితే, భరత్ మాత్రం తాను అన్నయ్యకు తోడుగా బిజినెస్ డెవలప్ చేస్తానని, ఉద్యోగం చేయబోనని, ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
vadinamma 21 october 2021 full episode
రఘురాం, సీతల మ్యారేజ్ డే అని తెలుసుకుని భరత్-సిరి, లక్ష్మణ్-శైలు, నాని-శిల్ప వారికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనకుంటారు. ఈ క్రమంలోనే సదరు మూడు జంటలు అందరూ నైట్ నిద్రించాక సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తారు. ఇక సీత ఉదయాన్నే లేచి బయటకు రాగానే ఆమెపైన పూలవర్షం కురిసేలా ప్లాన్ చేసి సర్ ప్రైజ్ చేస్తారు. అలా పూలు ఆమెపైన కురియడంతో సీత ఆశ్చర్యపోతుంది. అంతలోనే ఇలా జరిగిందేంటని రఘురామ్ కూడా బయటకు వస్తాడు.
వాళ్లిద్దరు ఇలా పూలు కురవడం ఏంటని ఆశ్చర్యపోతారు. కొద్దిసేపు ఆలోచించి ఒకరి ముఖం మరొకరు చూసుకుని ఇవాళ ఏమైనా విశేషమా? అని ఆలోచన చేస్తారు. అలా తమ పెళ్లి రోజు అని ఎట్ లాస్ట్ కనుక్కుంటారు. ఆ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేస్తున్నారని గ్రహిస్తారు. ఆ తర్వాత సీత, రఘురామ్ ఇద్దరూ కొత్త బట్టలు ధరించి బయటకు రాగా, వారిని చూసి అన్నా- వదినలు అంటూ తమ్ముళ్లు భావిస్తూనే.. ఆ సీతా రాముల మాదిరిగా ఈ సీతా రఘురామలు ఉన్నారని అనుకుంటారు. మొత్తంగా రఘురామ్, సీతల పెళ్లి రోజును అత్యద్భుతంగా సెలబ్రేట్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తారు ఫ్యామిలీ మెంబర్స్.
vadinamma 21 october 2021 full episode
ఈ క్రమంలోనే సీతకు ఇష్టమైన ఫుడ్ ఏంటని అందరు ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే సీత తల్లి ద్వారా కొబ్బరి చట్నీ ఇష్టమని తెలుసుకుని, దానిని ప్రిపేర్ చేయిస్తారు. అలా కొబ్బరి చట్నీ రెడీ కాగా దానిని చూసి సీత, రఘురామ్‌లు ఆశ్చర్యపోతారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అందరూ తమ పనులకు లీవ్ పెట్టేసి సంతోషంగా గడిపేస్తారు. ఇంతలోనే ఎపిసోడ్‌లో ఓ ట్విస్ట్ ఎదురవుతుంది. సీత తనకు పుట్టిన బిడ్డను శైలుకు బిడ్డగా ఇచ్చిన సంగతి వారికి మాత్రమే తెలిసింది. కాగా, ఆ బిడ్డను తన సొంత కొడుకుగా శైలు ఫీలవుతుంటుంది.
కాని ఈ విషయమై సీత బాధపడుతున్నట్లు కమింగ్ అప్‌లో చూపించారు. దానిని బట్టి సీత కన్న తల్లి అన్న విషయం శైలుకు తెలిస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతాయి. బుషి తన సొంత కొడుకు కాదని శైలు షాక్ గురయినట్లు సీన్ కనబడుతుంది. అయితే, అది నిజమేనా? లేదా కలగా చూపించారా? అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.