Home » Entertainment » Pawan Kalyan Reason To Hyper Aadi Missing In Sridevi Drama Company Last Two Episodes
Entertainment

Hyper Aadi : శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది కనిపించక పోవడంకు పవన్‌ కారణం తెలుసా?

Authored By
Himanshi
The Telugu News | Published on: March 2, 2022, 10:00 am
Advertisement

Hyper Aadi : జబర్దస్త్ లో హైపర్ ఆది… ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ లేకపోతే ఆ ఎపిసోడ్లు అంత సందడిగా ఉన్నట్లు అనిపించదు. ఇతర కమెడియన్స్ మరియు టీం లీడర్స్ ఎంత బాగా కామెడీ చేసినా.. సూపర్ హిట్ స్కిట్‌ కొట్టిన కూడా వారిద్దరూ లేకపోతే కచ్చితంగా ఆ ఎపిసోడు అసంపూర్తి అన్నట్లుగా మిగులుతుంది.  వారిద్దరికీ ఉన్న క్రేజ్ మరియు స్టార్డం అలాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వారిద్దరూ కలిసి చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అదే స్థాయిలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఇప్పుడు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కనిపించక పోయినా కూడా ఆ ఎపిసోడ్ వెలితిగా ఉంటుంది అని నిరూపితమైంది.

Advertisement

pawan kalyan reason to Hyper aadi missing in sridevi drama company last two episodes

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ రెండు ఎపిసోడ్ లకు హైపర్ ఆది కనిపించకుండా పోయాడు. అతను షూటింగ్ నిమిత్తం హాజరు కాలేదని.. వచ్చే వారం షో లో కనిపిస్తాడని మల్లెమాల వారు ప్రకటించినా కూడా ప్రేక్షకులు మాత్రం హైపర్ ఆది లేకపోవడంతో షో కు పెద్దగా ఆసక్తి చూపించలేదు. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ సంబంధించిన ప్రోమో తాజాగా యూట్యూబ్ లో స్ట్రీమింగ్‌ అయింది. ఆ ప్రోమో లో హైపర్ ఆది ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇంతకూ హైపర్ ఆది గత రెండు వారాలుగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో లేకపోవడానికి కారణం ఏమిటి అని వాకబు చేయగా తెలిసిన విషయం ఏంటంటే భీమ్లా నాయక్‌ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి హైపర్ ఆది స్టెప్పులు వేశాడు అని తెలుస్తోంది.

Advertisement

గణేష్ మాస్టర్ పట్టుబట్టి మరీ హైపర్ ఆది ని భీమ్లా నాయక్‌ సినిమాలోని పాటలు పెట్టాడని సమాచారం అందుతుంది. కేవలం హైపర్ ఆది మాత్రమే కాకుండా సునీల్ కూడా ఆ పాటలో కనిపించాడు. సరిగ్గా శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ సమయంలోనే భీమ్లా నాయక్‌ కోసం హైపర్ ఆది డేట్లు ఇవ్వాల్సి వచ్చింది. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన రెండు ఎపిసోడ్ లో హైపర్ ఆది లేడు. పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ని క్యాన్సల్ చేసుకొని మరీ హైపర్ ఆది అటుగా వెళ్లాడని తెలుస్తోంది.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి